కేసీయార్ నిప్పులు... అయినా మద్దతేనా....?
ఏపీకి తీరని అన్యాయం జరుగుతోంది. ఇది అందరికీ తెలిసిందే. ప్రతీ సారీ బడ్జెట్ లో ఏపీకి ఇలాగే జరుగుతోంది. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయినా కూడా ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో గెలిచిన వైసీపీ ఎంపీలు గట్టిగా నిలదీయలేకపోతున్నారు. అదే పొరుగున ఉన్న తెలంగాణాలోని అధికార టీయారెస్ ఎంపీలు అయితే ఇప్పటికే యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకుని విపక్షాలతో కలసి పార్లమెంట్ లో తమ నిరసనలు స్టార్ట్ చేశారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని టీయారెస్ ఎంపీలు బాయ్ కాట్ చేస్తే ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు మాత్రం సభలోనే ఉన్నారు. సరే బాయ్ కాట్ చేయాలని కాదు కానీ ఏపీకి సంబంధించి ఎంతో అన్యాయం జరిగింది. వాటి మీద ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీలు ఏంటి, ఇంతవరకూ చేసింది ఏంటి అని ఎందుకు అడగలేకపోతున్నారు అన్నదే చర్చగా ఉంది.
ఇక ఏపీ విభజన వల్ల దారుణంగా నష్టపోయినా కూడా ఎందుకో కేంద్రానికి మద్దతుగానే అన్నట్లుగా వైసీపీ వైఖరి ఉందని అనుమానిస్తున్నారు. మరో వైపు చూస్తే పెగాసస్ మీద అన్ని ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీయాలనుకుంటే వైసీపీ మాత్రం ఆ విషయంలో పట్టించుకోనట్లే ఉంది అంటున్నారు.
మరి కేంద్రం విషయంలో నాడు టీడీపీ ఏమీ చేయలేదని చెప్పిన వారు ఇపుడు పాతికకు 22 మంది ఎంపీలు ఇచ్చినా ఏమీ అడగకపోవడం మాత్రం బాధాకరమే అని అంటున్నారు. మరి మోడీ విషయంలో అయితే కేసీయార్ ఇప్పటికే ఘాటుగా మాట్లాడుతున్నారు. తాజా బడ్జెట్ విషయంలో ఆయన నిప్పులే చెరిగారు. ఏ మాత్రం ఉపయోగం లేదని కూడా అంటున్నారు.
ఈసారి బడ్జెట్ సమావేశాల్లో టీయారెస్ దేశంలోని ఇతర ప్రతిపక్షాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు సభ లోపలా బయటా చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. మరి మరో తెలుగు రాష్ట్రంగా ఉన్న వైసీపీ మాత్రం సహనమే తమ విధానం అంటోంది. అందుకే విపక్షాలతో పాటు కలవడంలేదని చెబుతున్నారు. మొత్తానికి ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా ఇలాగేనా అంటే దానికీ మౌనమే సమాధానం అవుతోంది.