వైసీపీ - టీఆర్ ఎస్ న‌యా వ్యూహం!..బాబు ఏకాకేనా?

Update: 2019-05-11 14:34 GMT
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌న్న విష‌యంపై ఇప్ప‌టిదాకా క్లారిటీ రానే లేదు. అయితే ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ గానీ - విప‌క్షంలో ఉన్న యూపీఏ గానీ... క్లిస్ట‌ర్ క్లియ‌ర్ మెజారిటీ అయితే సాధించ‌లేవ‌న్న విష‌యం మాత్రం తేలిపోయింది. అంతేకాకుండా గ‌తంలో మాదిరిగా కాకుండా ఈ ద‌ఫా మాత్రం ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కీల‌క భూమిక పోషించ‌నున్నాయ‌ని కూడా తేలిపోయింది. ఈ క్ర‌మంలో అటు ఎన్డీఏతో పాటు ఇటు యూపీఏ కూడా ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టే ప‌నిని ముమ్మ‌రం చేశాయ‌నే చెప్పాలి. ప్రాంతీయ పార్టీల విష‌యానికి వ‌స్తే.. ఉత్త‌రాది కంటే కూడా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన ప్రాంతీయ పార్టీలే ఈ ద‌ఫా జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్ప‌నున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లూ వినిపిస్తున్నాయి. వెర‌సి ఇప్పుడు జాతీయ పార్టీల క‌న్నంతా ద‌క్షిణాది ప్రాంతీయ పార్టీల‌పైనే ప‌డిపోయింది.

ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌. ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు... బీజేపీయేత‌ర కూట‌మి బ‌లోపేతానికి త‌న‌దైన స్టైల్లో వ్య‌వ‌హారం న‌డుపుతున్నారు. మోదీ మళ్లీ పీఎం పీఠం ఎక్క‌కుండా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్న చంద్ర‌బాబు... అందుకోసం ఏకంగా కాంగ్రెస్ పార్టీతో జ‌త‌క‌ట్టేశారు. త‌న‌కు అనుకూలంగా ఉన్న పార్టీల‌తో ఆయ‌న మంత‌నాలు కూడా జ‌రుపుతున్నారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి పెద్ద‌గా ఎంపీ సీట్లు ద‌క్కే ఛాన్స్ లేద‌న్న వాద‌న ఆయ‌న స్పీడ్ కు ఎక్క‌డిక‌క్క‌డ బ్రేకులు వేస్తోంది. ఇదే స‌మ‌యంలో ఈ ద‌ఫా ఏపీలో వైసీపీ మెజారిటీ ఎంపీ సీట్ల‌ను - తెలంగాణ‌లో మెజారిటీ ఎంపీ సీట్ల‌ను టీఆర్ ఎస్ సాధిస్తాయ‌ని అంచ‌నాలున్నాయి. ఈ క్ర‌మంలో ఈ రెండు పార్టీల‌తో కాంగ్రెస్ పార్టీ మంత‌నాలు సాగించేందుకు రంగంలోకి దిగింద‌ట‌. అయితే ఇక్క‌డే ఈ రెండు పార్టీ అధినేత‌లు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావులు త‌మ‌దైన కొత్త వ్యూహాన్ని తెర ముందుకు తెచ్చార‌ట‌.

త‌మ‌కు రాజ‌కీయంగా ఆగ‌ర్భ శ‌త్రువైన చంద్ర‌బాబు ఉండే కూట‌మిలోకి తామెలా వ‌స్తామ‌ని అనుకుంటున్నారంటూ... కాంగ్రెస్ దూత‌ల‌ను వారు నేరుగా ప్ర‌శ్నించార‌ట‌. మోదీకి వ్య‌తిరేకంగా ఏర్ప‌డే కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని, అయితే చంద్ర‌బాబు ఉండే కూట‌మిలో మాత్రం తాము భాగ‌స్వాములం కాలేమ‌ని తేల్చేశారు. అంటే... యూపీఏ నుంచి చంద్ర‌బాబును గెంటేస్తే... ఆ కూటమిలో చేరేందుకు తాము సిద్ధ‌మేన‌ని కూడా వారు తేల్చేశార‌ట‌. మ‌రి ఈ రెండు పార్టీల‌కు ఎంత లేద‌న్నా... 30కి పైగానే సీట్లు వ‌చ్చే అవ‌కాశాలున్న నేప‌థ్యంలో యూపీఏ కూట‌మి బాబును దూరం చేసుకునేందుకు వెనుకాడ‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే... చంద్ర‌బాబు ఇప్ప‌టికే రాష్ట్రంలో ఏకాకిగా మారితే... త్వ‌ర‌లో జాతీయ స్థాయిలోనూ ఏకాకిగా మారే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News