జగనన్న విద్యాకానుక వాయిదా.. కారణమిదే?

Update: 2020-09-05 04:00 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మధ్య జగన్ ప్రవేశపెడుతున్న కార్యక్రమాలన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. పేదలకు భూ పంపిణీ కూడా తేలడం లేదు. తాజాగా జగనన్న విద్యాకానుకను ప్రభుత్వం అక్టోబర్ 5కు వాయిదా వేసింది.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ లాక్ 4.0లో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 30వరకు పాఠశాలలు మూసివేత నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే వాయిదా వేసినట్టు ఏపీ విద్యాశాఖ తెలిపింది.

దీంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా జగనన్న విద్యాకానుకను అక్టోబర్ 5న అమలు చేయాలని నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.

జగనన్న విద్యాకానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరంలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా కిట్ల పంపిణీ చేస్తారు. విద్యార్థికి మూడు జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగులను కిట్ రూపంలో అందజేస్తారు.
Tags:    

Similar News