విమర్శిస్తున్న వారిపై విరుచుకుపడిన బర్త్ డే బాయ్
అన్ని రోజులు ఒకలా ఉండవన్నట్లుగా.. అన్ని పుట్టినరోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాటలతో ఫ్రూవ్ చేశారు. ప్రముఖులు..సెలబ్రిటీలు.. సామాన్యులు.. ఇలా పలువురు తమ పుట్టిన రోజున రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఆ రోజంతా కాసింత జోష్ తో.. సన్నిహితులతో.. కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు. సీఎం స్థాయి వ్యక్తులైతే.. రోటీన్ రాజకీయాల్ని వదిలేసి.. ఆ రోజున ఘాటు విమర్శలకు.. ఆరోపణలకు కాస్త దూరంగా ఉండటం చూస్తాం. ఈ రోజు బర్త్ డే బాయ్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.
తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన పథకాన్ని విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి తీవ్రంగా మాట్లాడారు. నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట అంటూ అడగాలన్నారు. 'మా ఇళ్లను ఓటీఎస్ లేకుండా మార్కెట్ రేట్లకు కొంటారా? అని అడగాలని.. మా అన్న ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంటే.. మీకెందుకు కడుపు మంట అని చంద్రబాబును.. రామోజీరావును.. రాధాక్రిష్ణను ప్రశ్నించాలన్నారు.
'మీ ఆస్తులైతే రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. పేదవాళ్లకైతే రిజిస్ట్రేషన్లు అవ్వకూడదా? మంచి చేస్తుంటే చంద్రబాబు.. రామోజీరావు.. రాధాక్రిష్ణలు జీర్ణించుకోలేకపోతున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకపోతే మీరు కొంటారా? వడ్డీ మాఫీ చేయమని ప్రతిపాదనలు ఐదుసార్లు పంపితే.. ఏదో ఒక వంకతో తిప్పి వెనక్కి పంపిన పెద్ద మనిషి చంద్రబాబు. రుణమాఫీ కాదు కదా.. వడ్డీ మాఫీ చేయని పెద్ద మనుషులు వీరు'' అని మండిపడ్డారు.
తాము చేపట్టిన ఓటీఎస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్థి చేకూరుతుందన్నారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఓటీఎస్ కార్యక్రమాన్ని చేపట్టామని.. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ.. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్.. స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. 52 లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ రూ.1.58 లక్షల కోట్లు ఉంటుందని.. సొంతిల్లు ఉంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. సొంతిల్లు అని ఊరిస్తూ.. ఎంతసేపూ.. అమ్ముకునే అంశాన్ని అంతలా హైలెట్ చేయటం ఏ మాత్రం బాగోలేదు జగన్ సారూ.