ఆదివారం రాత్రి 10 గంటల వేళలో అమిత్ షాతో జగన్ భేటీ? ఏం జరిగింది?

Update: 2023-05-29 10:46 GMT
అంచనాలకు వాస్తవాలకు మధ్య ఉండాల్సిన స్పష్టమైన విభజన రేఖ అంతకంతకూ కుదించుకుపోవటమే కాదు.. అంచనానే వాస్తవంగా చెప్పేసే రోజులు ఎక్కువైపోయాయి. తాజాగా అలాంటి తీరును ప్రదర్శించిన ఒక వార్త వైరల్ గా మారింది. విషయం ఏమంటే.. ఢిల్లీకి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆదివారం రాత్రి పది గంటల వేళలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది.

కట్ చేస్తే.. అమిత్ షా - జగన్ ముఖాముఖిన జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకుంటే.. అమిత్ షాతో తాను ఏమి మాట్లాడిందన్న విషయాన్ని జగన్ బయటకు చెప్పింది లేదు.

అలాఅని.. ఆయన వ్యతిరేక మీడియా ఆయనకు ఫోన్ చేసి.. అమిత్ షా తో మీరేం మాట్లాడాలని అడిగేంత సీన్ లేదు. ఇక.. కేంద్ర మంత్రి అమిత్ షా మీడియాతో దాదాపుగా మాట్లాడే ఛాన్స్ లేదు. అందునా సీఎం జగన్ వచ్చి.. ఏకాంతంగా భేటీ అయిన విషయాల్ని ఆయన షేర్ చేసే ఛాన్సే లేదు.

అలాంటప్పుడు పొద్దున్న ఒకట్రెండు పత్రికల్లో అమిత్ షా -జగన్ మధ్య భేటీలో చర్చించుకున్న అంశాలపై చేసిన అంశాల్లో వాస్తవాల కంటే కూడా అంచనాలే ఎక్కువగా ఉంటాయని చెప్పాలి.

ఇక.. మీడియాలోని రిపోర్టుల్ని చూస్తే.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును సీఎం జగన్ అమిత్ షా ద్రష్టికి తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు.

ఈ కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలను అమిత్ షాతో సీఎం జగన్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఏకాంతంగా ఇద్దరు మాత్రమే భేటీ అయిన వేళ.. అమిత్ షాకు సీఎం జగన్ ఏం చెప్పారన్న విషయాన్ని మీడియాలో చెప్పే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. అంచనాను వాస్తవంగా రాసేసిన వైనం చూస్తే.. ఆశ్చర్యానికి గురి కాక మానదు.

Similar News