ఏఐ వీడియోలను గుర్తించేలా కొత్త ఫీచర్... ఎలా చెక్ చేయాలంటే..!

అవును... గూగుల్ తన జెమినీ యాప్ కు ఒక ముఖ్యమైన అప్ డేట్ ను విడుదల చేసింది. తద్వారా ఏఐ సాధనాలను రోజువారీ ఉపయోగంలోకి మరింతగా తీసుకెళ్లేలా కొత్త ఫీచర్లను జోడించింది.;

Update: 2025-12-19 19:30 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిన తర్వాత ఏది ఒరిజినల్ వీడియోనో, మరేది నకిలీనో తెలుసుకోవడం చాలా కష్టంగా తయారైన పరిస్థితి. ఈ నేపథ్యంలో పలువురి సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోలు తెరపైకి వచ్చి వైరల్ అవ్వడం.. అనంతరం అది తమ వీడియో కాదని వారు క్లారిటీ ఇవ్వడం.. ఈ లోపు జరగాల్సింది జరిగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు ఓ పరిష్కారం తెచ్చింది జెమినీ!

అవును... గూగుల్ తన జెమినీ యాప్ కు ఒక ముఖ్యమైన అప్ డేట్ ను విడుదల చేసింది. తద్వారా ఏఐ సాధనాలను రోజువారీ ఉపయోగంలోకి మరింతగా తీసుకెళ్లేలా కొత్త ఫీచర్లను జోడించింది. ఈ అప్ డేట్.. నానో బనానాను ఉపయోగించి ఫోటోలు ఎడిట్ చేయడానికి కొత్త మార్గాన్ని పరిచయం చేస్తుంది. ఇదే సమయంలో ఫోటోలు, వీడియోలు ఒరిజినలేనా లేక ఏఐ జనరేటెడా అనే విషయాన్ని తెలుసుకునే సామర్థ్యాలను విస్తరిస్తుంది.

ఈ కొత్త ఇమేజ్ ప్రాంప్టింగ్ పద్దతిని ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ అంతటా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో ఒక వీడియోను అప్ లోడ్ చేసి.. ఇది ఏఐ ఉపయోగించి రూపొందించబడిందా? అని అడిగితే... ఆడియో, విజువల్ ట్రాక్ లలో కనిపించని సింథటిక్ వాటర్ మార్క్ కోసం జెమినీ స్కాన్ చేస్తుంది. ఈ సందర్భంగా.. దాని ప్రతిస్పందనను తెలియజేయడం కోసం దాని స్వంత తార్కికతను ఉపయోగిస్తుంది. అప్ లోడ్ చేసే ఫైల్స్ 100ఎంబీ, 90 సెకన్ల నిడివి వరకూ ఉండవచ్చు.

ఈ క్రమంలో ఉదాహరణకు... మీరు అప్ లోడ్ చేసిన వీడియోలో విజువల్స్ మార్చబడిందా లేదా అని గమనిస్తూనే.. ఆడియోనీ పరిశీలిస్తుంది. ఒక వేళ విజువల్స్ మార్చబడలేదని గమనిస్తూనే.. ఒక నిర్ధిష్ట ఆడియో విభాగంలో కనుగొనబడిందని జెమినీ నిర్ధారించవచ్చు. ఈ వెరిఫికేషన్ ఇప్పుడు జెమినీ సపోర్ట్ చేసే అన్ని ప్రాంతాలు, అన్ని భాషలలోనూ అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది.

Tags:    

Similar News