జగన్ సర్కారు సంచలన నిర్ణయం.. వారంతా ఆఫీసుకు రావాల్సిందేనట

Update: 2020-05-20 06:00 GMT
ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావటం తెలిసిందే. గడిచిన రెండు నెలలుగా ప్రజలు పాటిస్తున్న లాక్ డౌన్ కు చెల్లుచీటి ఇస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రేపటి (గురువారం) నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని పేర్కొంటూ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో కంటైన్ మెంట్ ప్రాంతాలకు మాత్రం దీని నుంచి మినహాయింపులు ఇచ్చారు. అంతేకాదు.. పెద్ద వయస్కులు.. గర్భవతులు.. ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడే వారంతా ఆఫీసుకు రాకున్నా ఫర్లేదని తేల్చేశారు. తాజాగా విడుదలైన ఈ ఉత్తర్వుల ప్రకారం గురువారం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు 90 శాతం సిబ్బందితో పని చేయాలన్న లక్ష్యాన్ని ఇచ్చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాల బయటా థర్మల్ స్క్రీనింగ్ తో పాటు.. చేతలుకు శానిటైజ్ చేసిన తర్వాతే లోపలకు పంపుతారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా మాస్కు ధరించటంతో పాటు.. ప్రతి రెండు గంటలకు ఒకసారి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని సర్కారు పేర్కొంది. భౌతిక దూరాల్ని తగ్గిస్తూ.. ప్రజలకు.. కిందనున్న సిబ్బందికి ఏదైనా చెప్పాలంటే.. వీడియో కాల్ ద్వారా చెప్పటం మంచిదని తేల్చారు. ఇదంతా చూసినప్పుడు ఇంతకాలం కొనసాగిన లాక్ డౌన్ కు భిన్నంగా మరింత వేగంగా నిర్ణయాలు తీసుకుంటానన్న సందేశాన్ని ఏపీ సర్కారు తాజా ఉత్తర్వులతో ఇచ్చేసిందని చెప్పాలి.
Tags:    

Similar News