వందేళ్ల పై చరిత్ర ఉన్న వర్సిటీలో చేరుతున్న జగన్ కూతురు
ఆగస్టు పదహారు నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన మొదలుకాబోతోంది. వారం రోజుల పాటు జగన్ అక్కడ పర్యటించబోతున్నారు. ఈ పర్యటన పూర్తిగా జగన్ సొంత ఖర్చులతో సాగబోతోంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన అని, ఆయనే సొంత ఖర్చులతో ఈ పర్యటన చేపడుతున్నారని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ పర్యటనలో జగన్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఈ పర్యటనకు ప్రభుత్వ నిధులు వాడట్లేదని స్పష్టం చేశారు. జగన్ సొంత ఖర్చులతో ఈ పర్యటన సాగుతుందని వివరించారు. అయితే ఈ పర్యటనలో కొన్ని రాష్ట్ర ప్రయోజనాల అంశాల పై కూడా జగన్ దృష్టి సారిస్తున్నారు.
అమెరికాలో పారిశ్రామికవేత్తలతో- ఎన్ ఆర్ ఐలతో జగన్ సమావేశం కాబోతున్నారు. పెట్టుబడులను ఆహ్వానిస్తూ వారితో సమావేశం కాబోతున్నారు జగన్ మోహన్ రెడ్డి. వ్యక్తిగతమైన పర్యటన అయినా ఇలా రాష్ట్ర ప్రయోజనాలకూ ఈ పర్యటనను ఉపయోగించుకుంటున్నారు జగన్.
ఇక ఈ పర్యటనలో జగన్ మరో ఉద్దేశం ఆయన కూతురు అడ్మిషన్ అని తెలుస్తోంది. యూఎస్ లోని ఇండియానా రాష్ట్రంలోని నోట్రే డేమ్ వర్సిటీలో జగన్ చిన్నకూతురు సీటు సంపాదించినట్టుగా తెలుస్తోంది. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును అభ్యసించనుందట. ఇప్పటికే జగన్ పెద్ద కూతురు లండన్ లోని ప్రముఖ విద్యాలయంలో చదువుతున్న సంగతి తెలిసిందే. చిన్న కూతురు యూఎస్ లో సీటు సంపాదించింది. ఈ పర్యటనలో భాగంగా కూతురు అడ్మిషన్ పని కూడా చూసుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి.