అమరావతి మీద వైసీపీ ఎన్ని ట్విస్టులో ?
వైసీపీ అమరావతి మీద మాట మారుస్తూ పోతూనే ఉంది అని అంటున్నారు. అంతే కాదు తాను అన్న మాటలనే తానే ట్విస్టులు ఇచ్చుకుంటూ పోవడమే వింతా విడ్డూరం అని అంటున్నారు;
దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని రకాలుగా ఒక విషయం మీద మాట్లాడి ఉండదు, అంతే కాదు సీరియస్ ఇష్యూస్ లో అనేక రకాలుగా స్టాండ్ మార్చుతూ పోయి ఉండదని అంటున్నారు అయితే ఏపీకి కీలకమైన రాజధాని విషయంలో మాత్రం వైసీపీ ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్నీ మాట్లాడుతోంది. వైసీపీ అమరావతి మీద మాట మారుస్తూ పోతూనే ఉంది అని అంటున్నారు. అంతే కాదు తాను అన్న మాటలనే తానే ట్విస్టులు ఇచ్చుకుంటూ పోవడమే వింతా విడ్డూరం అని అంటున్నారు.
మావిగాన్ లోనే అమరావతి :
లేటెస్ట్ గా చూస్తే కీలక వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే భలే ట్విస్ట్ ఇచ్చేశారు. తాము ఎపుడూ అమరావతి రాజధానిని వ్యతిరేకించడం లేదని ఆయన చెబుతూ అసలు మావిగాన్ లోనే అమరావతి ఉందని అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మచిలీపట్నం, విజయవాడ గుంటూరులలో అమరావతి కూడా ఉండదా అని ఆయన కొత్త పాయింట్ లేవనెత్తారు దాంతో ఇదేమి ట్విస్ట్ అనుకుంటున్నారు అంతా.
మూడు రాజధానులు అంటూ :
ఇంకో వైపు చూస్తే వైసీపీ అధికారంలో ఉన్నపుడు మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. అందులో పాలనా రాజధాని విశాఖ అని కూడా చెప్పారు. మరి ఆ విధంగా చేసినపుడు అమరావతిని కాదన్నట్లే కదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది అంటున్నారు. పూర్తి రాజధానిని మూడు రాజధానులుగా చేసి కేవలం శాసన రాజధానిగానే అమరావతిని ఉంచడం ద్వారా తగ్గించాలని చూశారు కదా అన్న విమర్శలు ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే అమరావతి విషయంలో ఒక్క పైసా కూడా వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఖర్చు చేయలేదని ఇపుడు అమరావతికి తాము వ్యతిరేకం కాదని ఎలా చెప్పగలుగుతారు అని ప్రశ్నిస్తున్నారు.
గందరగోళమేనా :
వైసీపీ అధినాయకత్వం మావిగాన్ అన్నది, దానిని సమర్ధించే క్రమంలో విషయాన్ని వైసీపీ నేతలు అనేక మలుపులు తిప్పుతున్నారని అంటున్నారు. అంతే కాదు గతంలో తాము ఏమి అన్నాం, ఏమి చేశామన్నది కూడా పక్కన పెట్టి కొత్త విషయాలను చెబుతూ పోతున్నారని కూడా గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రా ప్రాంతానికే చెందిన గుడివాడ అమర్నాధ్ గతంలో విశాఖ రాజధాని అని మాట్లాడారని ఇపుడు మావిగాన్ అంటున్నారు అంటే విశాఖ ఉత్తరాంధ్రా సంగతి వైసీపీ కూడా చాలా కన్వీనియంట్ గా మరచిపోయినట్లేనా అన్న చర్చ అయితే వస్తోంది. మొత్తం మీద చూస్తే కనుక వైసీపీ పూర్తిగా గందరగోళంలో ఉంటూ అమరావతి విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు.