కేబినెట్ లో గ్రంధికి బెర్తు ఖాయమా? మిగిలిన వారు వీరేనా?
ప్రమాణస్వీకారం చేసినంతనే తన కేబినెట్ లో ఉన్న వారికి స్థాన చలనం తప్పదని.. రెండున్నరేళ్లకే కేబినెట్ లో భారీ మార్పులు ఖాయమన్న మాటను సీఎం జగన్ స్పష్టం చేయటం తెలిసిందే. అందుకు తగ్గట్లే కొంతకాలంగా సంకేతాలు అందుతున్నాయి. మార్పు ఖాయమన్న మాటతో పాటు.. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా ఉండే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. అది లేకున్నా పని చేస్తానని స్పష్టం చేయటం తెలిసిందే. దీంతో.. ఇప్పుడు కేబినెట్ లో ఉన్న వారందరిని తీసేసి.. కొత్త టీంతో పని చేసినా అభ్యంతరం చెప్పని నేతలు పలువురు ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరోసారి అధికారంలోకి రావటం ఖాయమన్న భావనలో ఉన్న వారు.. ఇప్పుడు కాకున్నా.. అధినేత మనసులో చోటు ఉంటే తమ భవిష్యత్తుకు ఢోకా లేదన్న భావనతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం అందరిని తొలగిస్తారన్న చర్చ జరుగుతుంటే.. మరో అంచనా ప్రకారం కొద్దిమందిని మాత్రం ఉంచి.. మిగిలిన వారిపై వేటు వేస్తారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటివేళ.. ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ కేబినెట్ మార్పు ఎప్పుడు జరుగుతుందన్న దానిపై సమయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు.
అయితే.. దీనికి సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ఎవరి లెక్కలు వారివి అన్నట్లుగా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాన్ ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ కు మాత్రం ఈసారి మంత్రి వర్గంలో చోటు ఖాయమన్న మాట వినిపిస్తోంది. జనసేన బలాన్ని ఆదిలోనే తుంచేయటంలో గ్రంధి కీలకంగా వ్యవహరించారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ.. అసెంబ్లీలో పవన్ ఉండి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని.. దాన్ని అడ్డుకోవటంలో గ్రంథి పడిన కష్టానికి ఫలితం ఖాయమని చెబుతున్నారు
ఇదిలా ఉంటే జిల్లాల వారీగా కేబినెట్ లో చోటు దక్కే వీలు ఉందన్న నేతల విషయానికి వస్తే..
కర్నూలు జిల్లా
- శిల్పా చక్రపాణి రెడ్డి
కడప జిల్లా
- శ్రీకాంత్ రెడ్డి
- కోరుముట్ల శ్రీనివాసులు
- సి. రామచంద్రయ్య
అనంతపురం జిల్లా
- తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
- అనంత వెంకట్రామిరెడ్డి
- ఉషశ్రీ చరణ్
- జొన్నలగడ్డ పద్మావతి
చిత్తూరు జిల్లా
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (కొనసాగింపు)
- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే ఆర్కే రోజా
- పెద్ది రెడ్డిని తప్పిస్తే వీరిద్దరికి పదవులు ఖాయం
నెల్లూరు జిల్లా
- అనం రామనారాయణ రెడ్డి
- నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
- కిలివేటి సంజీవయ్య
ప్రకాశం జిల్లా
- మహీధర్ రెడ్డి
గుంటూరు జిల్లా
- పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి
- విడుదల రజనీ
- కోనా రఘుపతి
- మహ్మద్ ముస్తాఫా
క్రిష్ణా జిల్లా
- కొలుసు పార్థసారధి
- సామినేని ఉదయభాను
- జోగి రమేశ్
- మర్రి రాజశేఖర్
పశ్చిమ గోదావరి జిల్లా
- ముదునూరి ప్రసాదరాజు
- గ్రంధి శ్రీనివాస్
- కొట్టు సత్యానారాయణ
- తలారి వెంట్రావు
తూర్పు గోదావరి జిల్లా
- పేర్లపై సస్పెన్స్ నెలకొని ఉంది
విశాఖ పట్నం జిల్లా
- గుడివాడ అమర్ నాథ్
- ఉమాశంకర్ గణేశ్
- కరణం ధర్మశ్రీ
- కె. భాగ్యలక్ష్మీ
విజయనగరం జిల్లా
- కోలగట్ల వీరభద్రస్వామి
- పీడిక రాజన్నదొర
శ్రీకాకుళం జిల్లా
- ధర్మాన ప్రసాదరావు