అనర్హత: దానం ‘యూ’టర్న్ !
పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయాన్ని కొట్టి వేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయాన్ని కొట్టి వేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం దానం నాగేందర్ మాట్లాడుతూ ‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, ఖైరతాబాద్ కు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్దంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా దానం నాగేందర్ ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ’హైకోర్టు తీర్పు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని, తాను కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చదివానని, హైకోర్టు తీర్పు స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద వచ్చిందని, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలా ? వద్దా ? అన్న విషయం స్పీకర్ తీసుకోవాలని’ దానం నాగేందర్ అన్నారు.
హైకోర్టు తీర్పు అనంతరం తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, నువ్వు ఫైటర్ వు, ఫైట్ చేద్దాం అని ఆయన అన్నారని దానం నాగేందర్ అన్నారు. నాకు ఎన్నికలు కొత్త కాదని, కొట్లాడటానికి తాను ఇష్టపడతానని, నేను ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని, తన కార్యకర్తలకు కూడా ఇదే విషయం చెబుతానని దానం స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో తమ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తుందని అన్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లడం అనే విషయం స్పీకర్ చూసుకుంటారని దానం అన్నారు.
అయితే దానం నాగేందర్ మీద అనర్హత వేటు నేపథ్యంలో అది నాలుగేళ్లా ? ఆరేళ్లా ? అన్న విషయంలో క్లారిటీ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిగాయని, హైకోర్టు తీర్పు విషయంలో సుప్రీంను ఆశ్రయించడం ఖాయం అని అంటున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారన్న వార్తల నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని భావించాలి.