తైమామన్ సీర్ : సెంటిమెంటుతో కొడుతున్న దళపతి !

తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకె అధినేత, ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్ మరో కొత్త పతకానికి ఈ నెల 28 నుండి అమలులోకి రాబోతుంది.

Update: 2026-09-19 07:39 GMT

తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకె అధినేత, ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్ మరో కొత్త పతకానికి ఈ నెల 28 నుండి అమలులోకి రాబోతుంది. సినిమాల్లోనే కాదు పాలనలోనూ తన మార్కు సెంటిమెంటుతో ప్రజలను ఆకట్టుకునేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నాడు. తమిళ సాంప్రదాయం ప్రకారం పుట్టిన బిడ్డలకు మేనమామ బంగారం ఇవ్వడం ఆనవాయితీ. దీనినే తైమామన్ సీర్ అని పిలుస్తారు.

ఈ నేపథ్యంలో సీఎం విజయ్ తైమామన్ తంగ మోతిరం తిట్టం (మేనమామ బంగారు ఉంగరం పథకం ఈ నెల 28 నుండి ప్రారంభించనున్నారు. దీని కోసం 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారు ఉంగరాలు 1.28 లక్షలు తయారుచేయించారు. మొదటి విడతలో వీటిని 107 కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు.

తమిళనాడులో ఏటా ఏడు నుండి 8 లక్షల ప్రసవాలు జరుగుతుంటాయి. అందులో నాలుగున్నర లక్షల వరకు ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతాయని అంచనా. ఈ నేపథ్యంలోనే ఏటా 4.41 లక్షల ఉంగరాలు అవసరం అవుతాయన్న అంచనాతో బడ్జెట్లో రూ.755.83 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి శిశువుకు బేబీ కేర్ కిట్ తో పాటు ఈ ఒక గ్రాము ఉంగరం అందజేస్తారు.

అయితే ఈ పథకం ద్వారా లబ్దిపొందాలి అంటే తమిళనాడులో శాశ్వత నివాసం ఉన్నవారు, పీఐసీఎమ్ఈ పోర్టల్, ఆర్ సీ హెచ్ పోర్టల్ నమోదు అయి ఉండి, ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన శిశువులకే ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచడం, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ బాధ్యత మీద నమ్మకం పెంచడం ఈ పథకం ఉద్దేశం. బేబీ కేర్ కిట్ తో పాటు ఇచ్చే ఈ ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్ తో పాటు, ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ ఉండడం విశేషం.

అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను నెరవేర్చే దిశగా సీఎం విజయ్ అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే రూ.75 వేల వరకు ఉన్న 14 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయడం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు, సింగప్పెన్ పేరుెతో మహిళల భద్రతా దళం, స్టింగ్ పేరుతో యాంటీ డ్రగ్ స్క్వాడ్, పాఠశాలలు దేవాలయాల వద్ద 717 మద్యం దుకాణాల మూసివేత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు బంగారు ఉంగరం పథకం కూడా అందులో చేరబోతుంది.

Tags:    

Similar News