అమ్మాయిపై అత్యాచర యత్నం..ఆ పై వీడియో..
దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. పైగా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జరిగిన సంఘటన ఇందుకు అద్దం పడుతోంది. వారితో స్నేహంగా ఉండటమే ఆ యువతికి శాపమైంది. డిగ్రీ చదువుతున్న ఓ యువతిని మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన లవరే చెరపట్టి అత్యాచారం చేయమని తన స్నేహితుడికి అప్పగించాడు. ఆ పై ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో అన్ని టీవీ చానెళ్లలో హల్ చల్ చేయడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ మృగాళ్లను అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే..
వివరాల్లోకెళితే... ఓ యువతి పట్టణంలో డిగ్రీ చదువుతోంది. కాగా కనిగిరిలోనే ఉండే కార్తీక్ యువకుడు అనే డిగ్రీ ఫెయిల్ అయి ఖాళీగా ఉంటున్నాడు. ఆ యువతి.. కార్తీక్ తో కొంతకాలంగా స్నేహంగా ఉంటోంది. ఒక రోజు మాట్లాడుకుందామంటూ కార్తీక్ ఆ యువతిని ఊరి చివర ఉన్న పొలాల వద్దకు తీసుకెళ్లాడు. తన స్నేహితులైన సాయి - పవన్ లను కూడా రమ్మని పిలిచాడు. యువతితోపాటు ఆమె స్నేహితురాలు వెళ్లింది. అక్కడకు వెళ్లిన తర్వాత అందరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. ఇంతలో వారిలో మృగాళ్లు మేల్కొన్నారు. కార్తీక్ తన స్నేహితురాలైన యువతిని రేప్ చేయమంటూ.. తన ఫ్రెండ్ సాయికి అప్పగించాడు. సాయి ఆ అమ్మాయిని అసభ్యంగా తాకుతూ.. దౌర్జన్యంగా బట్టలు విప్పే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ప్రాధేయపడుతూ ఏడుస్తున్నా కనికరించకుండా నీచంగా వ్యవహరించాడు. దీన్నంతా కార్తీక్ ఫోన్ లో చిత్రీకరించాడు.
అంతేకాకుండా ఆ యువతి తప్పించుకునే ప్రయత్నం చేయగా *తంతా.. ఎక్కడికి పోతావు.. చస్తావ్.. ఇక్కడే చంపుతా* అంటూ తీవ్ర బెదిరింపులకు దిగాడు. యువతితోపాటు ఆమె స్నేహితురాలు కూడా వదిలేయమని బ్రతిమలాడినా వారి మనసు కరగలేదు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా వ్యవహరించాడు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఆ యువతి బట్టలు చించుతూ అనాగరికంగా వ్యవహరించారు. అంతేకాకుండా సభ్యత మరిచి ఆ యువతిని తన ఫ్రెండ్ అత్యాచారయత్నం చేస్తుంటే సిగ్గు లేకుండా ఫోన్ లో వీడియో చిత్రీకరించారు. చివరకు ఎలాగొలా తప్పించుకుని ఇంటికి చేరుకున్న యువతి.. తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు పరువుపోతుందని మిన్నకుండిపోయారు. తాజాగా ఆ మృగాళ్లు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ముగ్గురు కీచకులని అరెస్టు చేశారు.