• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు యూటర్న్ ల ఎఫెక్ట్......

బాబు యూటర్న్ ల ఎఫెక్ట్... 'ఎల్లో' కు ఎన్నెన్ని కష్టాలో?

By - Tupaki Desk
Update: 2020-01-28 14:30 GMT
నిజమే... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్న్ ల పుణ్యమా అని ‘ఎల్లో మీడియా’గా పేరుపడ్డ ఆయన అనుకూల మీడియాకు ఇప్పుడు లెక్కలేనన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. అదేదో... చంద్రబాబు అంటే గిట్టని - ఎల్లో మీడియా అంటే గిట్టని సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపులు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయంలో జగన్ తో ఎంతమాత్ర ప్రమేయం లేకుండానే ఎల్లో మీడియా నానా కష్టాలు పడుతోంది. అది కూడా కేవలం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి కారణంగానే. నిజమే మరి... ఏదేనీ అంశంపై ఒకసారి మాట మారిస్తే - లేదంటే రెండు సార్లు మాట మారిస్తే... ఎలాగోలా సర్దుకోవచ్చు. అలా కాకుండా ప్రతిసారీ తన వైఖరిని చంద్రబాబు మార్చుకుంటూ పోతుంటే... ఆయనను - ఆయన వైఖరిని - ఆయన విజన్ ను భుజానికెత్తుకుని మోయడమంటే... ఎల్లో మీడియాకు ఏం ఖర్మ... ఎవరికైనా కష్టమే కదా.

ఈ తరమా పరిస్థితి ఎల్లో మీడియాకు ఇప్పుడు మాత్రమే వచ్చిన సమస్య  కాదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా ఎల్లో మీడియా ఈ తరహా ఇబ్బందినే ఎదుర్కొంటోంది. అయితే బాబు అధికారంలో ఉండగా... అధికార పార్టీకి అనుకూల మీడియాగా ఎల్లో మీడియా ఎలాగోలా నెట్టుకొచ్చింది గానీ... ఇప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా మారిపోయారు కదా. విపక్ష నేేత నోట నుంచి వెలువడే వ్యాఖ్యలు - పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను భుజానికెత్తుకుని మోయడం ఎల్లో మీడియాకు కష్టమే కదా. ఓ అంశంపై తనది ఇదే వైఖరి అంటూ ప్రకటిస్తే.. దానిని మోయం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే అదే వైఖరిని అవసరం వచ్చిన ప్రతిసారీ మార్చుకుంటూ సాగితే... ఆ మారిన వైఖరులను మోయడం ఎల్లో మీడియాకు ఇప్పుడు తలకు మించిన భారంగానే మారిపోయింది.

మొన్నటికి మొన్న ఆంగ్ల మాధ్యమం మీద జగన్ సర్కారు దూకుడుగా సాగితే... తెలుగును చంపేస్తున్నారా? అంటూ బాబు ఓంకెలు పెట్టారు. వెంటనే ఎల్లో మీడియా కూడా తెలుగు చచ్చిపోతోందని ఓ రేంజి కథనాలు రాసింది. ఆ తర్వాత ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకం కాదని బాబు చెబితే... ఎల్లో మీడియాకు షాక్ తగిలింది. ఆ షాక్ నుంచి తేరుకున్న ఎల్లో మీడియాకు ఇక ఆ తర్వాత వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎలా నిలువరించాలో తెలియక చంద్రబాబు సతమతమవుతుంటే... ఎల్లో మీడియా కూడా ఆయన బాటలోనే సాగుతూ... బాబు యూటర్న్ తీసుకున్న ప్రతిసారీ... ఎల్లో మీడియా కూడా తన వైఖరిని మార్చుకునేందుకు నానా యాతన పడుతోంది. తాజాగా ఏపీకి మూడు రాజధానుల విషయంలో జగన్ కు బ్రేకులేశానంటూ బీరాలు పలికిన చంద్రబాబును ఆకాశానికెత్తేసిన ఎల్లో మీడియా... ఆ వెంటనే జగన్ శాసనమండలి రద్దు చేయడంతో షాక్ తిన్నది. మండలి అవసరం లేదని గతంలో బాబే స్వయంగా చెప్పారాయే. ఇప్పుడేమో... మండలిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటే... బాబు దానిని వ్యతిరేకిస్తూ మాట్లాడితే...దానిని బలపరిచేలా కథనాలు వండి వార్చేందుకు నిజంగానే ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. అంతేకాకుండా ఇలా చంద్రబాబు ప్రతిసారీ తన వైఖరి మార్చుకుంటూ పోతే.. ఆయన మాదిరే మనమూ యూటర్న్ తీసుకుంటే.. జనంలో మనం పలచనబడిపోమా? అన్న భావన ఎల్లో మీడియాకు కంటి మీద కునుకు పడనీయడం లేదట.

   

Tags:    
  • Yellow Media 
  • Chandrababu Naidu 
  • u Turn 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS