ఏపీ స్పీకర్ వ్యాఖ్యలపై యనమల తాజా క్లారిటీ ఇదే!!

Update: 2020-08-09 08:30 GMT
మూడు రాజధానులకు సంబంధించిన అంశం ఏపీ అధికార.. విపక్ష నేతల మధ్య హాట్ హాట్ చర్చకు.. విమర్శలకు తావొస్తున్న సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ నేత యనమల స్పీకర్ గా వ్యవహరించిన సమయంలో ఇచ్చిన రూలింగ్ ను ఏపీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం ప్రస్తావించటం తెలిసిందే. యనమల చెప్పినట్లుగా సభా నిర్ణయాల్లో కోర్టుల జోక్యం చేసుకోరాదని వ్యాఖ్యానించటం తెలిసిందే.

తానిచ్చిన రూలింగ్ ను సభాపతిగా వ్యవహరిస్తున్న తమ్మినేని ప్రస్తావించటంపై యనమల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చట్టసభల కార్యకలాపాల్లో.. చర్చల్లో.. సభా నిర్ణయాల్లో కోర్టుల జోక్యం చేసుకోవద్దని గతంలో రూలింగ్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తుత స్పీకర్ తమ్మినేని ప్రస్తావించటం సంతోషంగా ఉందన్న యనమల.. సదరు రూలింగ్ చట్టవ్యతిరేకమైతే ప్రశ్నించొచ్చు అని పేర్కొన్నారు.

ఈ కారణంగానే మూడు రాజధానుల అంశంపై తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. సభ లోపల కానీ బయట కానీ సభ్యులు చేసే ప్రసంగాలకు.. హోస్ ప్రొసీడింగ్స్ కు సంబంధం ఉండదన్నారు. సభ వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. కోర్టుల జోక్యం ఉంటుందని స్పష్టం చేశారు.

మూడు రాజధానుల అంశాన్ని కోర్టుల్లో ప్రస్తావించటానికి కారణం చెప్పిన యనమల.. ‘‘అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించిన అపిడవిట్ లో సీఆర్ డీఏ రద్దు.. పాలన వికేంద్రీకరణ బిల్లులు శాసనమండలి సెలెక్టు కమిటీల వద్ద ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ బిల్లుల్ని ఎలా తీసుకొస్తుంది? అది సరైన పద్దతి కాదు’’ అని పేర్కొన్నారు. యనమల ఇచ్చిన క్లారిటీపై.. సభాపతి తమ్మినేని ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.  


Tags:    

Similar News