బాబుకు ఊతం.. విజ‌న్ - 2047కు రెక్క‌లు.. !

మ‌రోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి మార్గం విలువ రాను రాను క్షీణిస్తోంది. ఇక బంగారం విలువ పగ్గాలు లేని గుర్రంలా పరిగెడుతున్న విషయం తెలిసిందే.;

Update: 2026-02-03 01:30 GMT

కేంద్ర బడ్జెట్ లో ఏపీ ఏ మేరకు సక్సెస్ అయింది.. ఏ మేరకు ఏపీకి ఫలితాలు వచ్చాయి.. అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు ప్రధాన రాజకీయ పార్టీల్లోనూ చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో కూటమిగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు ఇస్తున్న టిడిపి ఏపీలో అధికారంలో ఉండటమే. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిన పడుతున్న క్రమంలో కేంద్రం నుంచి భారీ స్థాయిలో మద్దతు కోరుకుంటున్నారు సీఎం చంద్రబాబు. దీనికి ఈ బడ్జెట్‌ను ప్రధాన ప్రాతిపదికగా ఆయన ఎంచుకున్న మాట వాస్తవం.

దాదాపు బడ్జెట్ ప్రారంభానికి ముందే మూడు నుంచి నాలుగు సార్లు ఆయన ఢిల్లీలో పర్యటించారు. ఇక మంత్రి నారా లోకేష్ అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి కేశ‌వ్‌ సహా ఆర్థిక శాఖ అధికారులు కూడా పదే పదే కేంద్రం చుట్టూ తిరిగారు. దీంతో తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో భారీ స్థాయిలో ఏపీకి కేటాయింపులు ఉంటాయని అంచనా వేసుకోవడం తప్పుకాదు. కానీ, అసలు జరిగిందేమిటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది అనేది ఆసక్తిగా మారింది.

ప్రపంచంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వంటివి ప్ర‌స్తుత‌ బడ్జెట్లో ప్రభావం చూపించాయి అనే చెప్పాలి. ట్రంప్ విధిస్తున్న భారీ సంకాల‌ కారణంగా అనేక పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. అనేక వృత్తి విద్యలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పారిశ్రామికంగా కూడా దేశానికి ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడ్డాయి.

మ‌రోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి మార్గం విలువ రాను రాను క్షీణిస్తోంది. ఇక బంగారం విలువ పగ్గాలు లేని గుర్రంలా పరిగెడుతున్న విషయం తెలిసిందే. ఇన్ని అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఉదారంగా చూడకుండా చాలా నిశితంగా గమనించి ఆచితూచి అడుగులు వేసిన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఈ నేపథ్యంలో పర్టికులర్గా ఒక రాష్ట్రానికి మేలు చేసే విధంగా.. లేకపోతే ఒక వర్గానికి మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించలేదు అన్నది స్పష్టమైనది.

అందుకే ఏపీకి భారీ స్థాయిలో ఆశించిన ప్రయోజనాలు జరిగాయా అంటే జరగలేదని చెప్పాలి. కానీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మాత్రం ఒకింత మెరుగైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పోలవరానికి మూడు వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. అమరావతికి సంబంధించి1500 కోట్ల రూపాయలను ఇచ్చారు. అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించనున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నంలోని డేటా సెంటర్ కు భారీ స్థాయిలో రాయితీలు ఇచ్చారు. వ‌చ్చే 20 ఏళ్ల పాటు టాక్స్ హాలిడే కూడా ప్రకటించారు. ఇది రాష్ట్రానికి మేలు చేసే ప‌రిణామంగా మారనుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే బడ్జెట్లో ఒక రకంగా ఏపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. అదే విధంగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు కూడా ఏపీ మీదుగా నడవనున్నాయి. ఇది కూడా ఒక రకంగా రాష్ట్రానికి మేలు చేసే పరిణామం. ఇక రేర్ మినరల్స్ విషయంలో కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఏపీకి కూడా భాగస్వామ్యం కల్పించారు.

ఇక ఓడ‌ రేవుల అభివృద్ధి విషయాన్ని తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న ఓడరేవులు మరింతగా డెవలప్ కానున్నాయి. అదేవిధంగా భారీ స్థాయిలో ప్రోత్సాహకాలను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 5000 కోట్ల రూపాయలు ఎంఎస్ ఎంఈలకు ఇవ్వడం ద్వారా చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపేట వేసింది. ఇది ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసే పరిణామం. సో ఇలా చూసుకున్నప్పుడు కేంద్ర బడ్జెట్లో ఒకరకంగా ఏపీ సక్సెస్ అయిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రవచిస్తున్న విజన్ -2047 లక్ష్యాలకు అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉండడం విశేషం అనే భావిస్తున్నారు.

Tags:    

Similar News