అక్రమ సంబంధాలు-బలహీనతతో మొదలై ...చివరికి !

అంతదాకా చప్పగా సాగిన జీవితం కొత్త ఉత్సాహంతో ముందుకు పరుగులు పెడుతుందని కూడా మానసిక శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.;

Update: 2026-02-03 02:45 GMT

ఈ రోజున అక్రమ సంబంధాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. వార్తలలో అతి ముఖ్య అంశాలుగా అవి మారిపోయాయి. అక్రమ సంబంధం అన్నది ఒకనాడు వింతగా కొత్తగా తోచేది, నేరం చేసిన వారుగా వారిని చూసేవారు, సమాజం కూడా వారి పట్ల కఠినంగా వ్యవహరించేది. ఇపుడు సామాజిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అలాగని ఓపెన్ గా సపోర్టు చేస్తుందని కాదు కానీ మునుపటి కంటే ఇపుడు కొంత లైట్ గా తీసుకుంటున్నారు. సమాజంలో ఇది ఒక ట్రెండ్ గా మారిందని అంటున్న వారూ ఉన్నారు.

ఎందుకు అక్రమ సంబంధాలు :

అసలు సక్రమంగా జీవితం గడిపితేనే ఎంతో హాయి కదా ఎందుకొచ్చిన ఈ అక్రమ సంబంధాలు అన్నది ప్రశ్న ప్రతీ వారికీ వస్తుంది. పైగా దొంగతం కానీ ఈ అక్రమ సంబంధాలు కానీ ఏదో నాటికి కచ్చితంగా బయటపడతాయి అని తెలిసి కూడా ఎందుకు వీటి మీద మోజు పడుతున్నారు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తల నిపుణులు చెబుతున్నారు. తమ సంసారంలో సారం లేకపోవడం, భాగస్వామి పట్టించుకోకపోవడం ఉదాశీనంగా వ్యవహరించడం, నిర్లక్ష్యం చేయడం ఇలా అనేక కారణాల నుంచే పక్క చూపులకు ఆసక్తి పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక రకమైన మానసిక ఒంటరి తనం నుంచి బయటపడేందుకే ఈ అక్రమ పద్ధతులను ఆశ్రయిస్తారు అని అంటున్నారు.

భావోద్వేగంతోనే :

ఈ అక్రమ సంబంధాలు అన్నీ శారీరక బంధాల కోసం మొదట కానే కావు అని అంటారు. భావోద్వేగమైన బంధం కోసం స్టార్ట్ అయి ఆ మీదట అవి శారీరక సంబంధాలుగా బలంగా పెనవేసుకుని పోతాయని అంటున్నారు. కొత్త తోడు తమను బాగా పట్టించుకోవడం, శ్రద్ధగా చూడడం, తమ మీదనే ఫోకస్ పెట్టడం వంటివి మానసికంగా ఎంతో ఆనందాన్ని ఇస్తాయని అంటున్నారు. తమలోని అశాంతిని మనసు పడే ఘర్షణలను తీర్చే ఒక ఉపశమనంగా వీటిని చూస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.

కొత్త ఉత్సాహంతోనే :

అంతదాకా చప్పగా సాగిన జీవితం కొత్త ఉత్సాహంతో ముందుకు పరుగులు పెడుతుందని కూడా మానసిక శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. కొత్తగా తమను తాము చూసుకోవడం, లేద అవతల వారు అభివర్ణించడంతో తమకు లైఫ్ అంటే ఇదే కదా అనిపిస్తుంది అని విశ్లేషిస్తున్నారు. ఇక ఇందులో ఉండే రిస్క్ కూడా మజాను ఇస్తుందని చెబుతున్నారు దీనివల్ల మెదడులో డోపమైన్ అనే కెమికల్ ఎకువగా విడుదల అవుతుందని అంటున్నారు. అలా ఆ అనుభూతి ఎంతో స్ట్రాంగ్ గా మారడంతో ఈ అక్రమ సంబంధమే ఒక వ్యసనంగా మారుతుందని అంటున్నారు. దీంతో రేపు ఏమి జరుగుతుంది, సమాజం ఏమి అనుకుంటుంది, కుటుంబాలు ఏమి అవుతాయి అన్న ఆలోచనలు కూడా పూర్తిగా పక్కకు పోతాయని ఈ సమయమే శాశ్వతం అని ఇలాగే కలకాలం కాలం నిలిచిపోనీ అన్న భావనతో వీరు ఉంటారని అంటున్నారు. అలా అక్రమ సంబంధం అన్నది ఒక బలహీనతతో మొదలై బలమైన వ్యసనంగా మారుతుంది అని అంటున్నారు.

డోంట్ కేర్ దాకా :

ఇక సమాజం గురించి కూడా ఆలోచన వచ్చినపుడు డోంట్ కేర్ అన్న బరితెగింపు కూడా మొదలవుతుందని అంటున్నారు. నా జీవితం నా సొంతం నా ఆనందం నా కోసం ఈ రకమైన ఫీలింగ్స్ డామినేట్ చేస్తూ చుట్టూ ఏమి జరిగినా లైట్ తీసుకునే నేచర్ కి వచ్చేస్తాతు అని అంటున్నారు. దాంతో అపరాధ భావం కానీ తప్పు చేస్తున్నామన్న భావన కానీ పోయి తామే ఏదో సాహసం చేస్తున్నామన్న ఒక రకమైన భ్రాంతి లాంటి భావనలోకి నెట్టబడతారు ని మానసిక శాస్త్ర వేత్తలు అంటున్నారు.

కుటుంబాలు విచ్చిన్నం :

అక్రమ సంబంధాల వచ్చ పచ్చని కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. వీక్ నెస్ తో వీటికి అలవాటు పడిన వారు చివరికి తమతో పాటు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. సభ్య సమాజం ఎప్పటికీ వీటిని అంగీకరించదని తెలిసి కూడా ఇదే బాటన పడుతున్నారు అంటే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సాధనాలు ఒక కారణం అయితే ఈ రోజున ఉన్న బిజీ లైఫ్ లో జీవిత భాగస్వాముల మధ్య ఉండాల్సిన బంధాలు గట్టిగా లేకపోవడం అసలైన కారణంగా చెబుతున్నారు. ఏ జంట అయితే అన్యోన్యంగా ఉంటుందో వారి దరిదాపులకు కూడా ఇలాంటి చెడు వ్యసనం రానే రాదని అంటున్నారు. అలా అవగాహన అనురాగం ఆప్యాయతతో జంటలు ఉంటే సమాజం కూడా ఉత్తమంగా ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News