అయోధ్య మసీదు నిర్మాణానికి విరాళాలు ఇవ్వడం మంచిది కాదట !

Update: 2021-01-28 11:00 GMT
అయోధ్యలో నిర్మించదలచిన మసీదును అసలు మసీదనే పిలవొద్దంటూ.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అయోధ్యంలో ప్రస్తుతం నిర్మిస్తోన్న మసీదులో ప్రార్థనలు చేయడం సరి కాదు అన్నారు. అలాగే అయోధ్య లో నిర్మించే ఆ మసీదు నిర్మాణానికి విరాళాలు ఇవ్వడం ఇస్లాం ప్రకారం తప్పు అని అన్నారు.

బాబ్రీ మసీదును కూలగొట్టిన తర్వాత వివాదం తలెత్తగా.. సుదీర్ఘ కాలంపాటు విచారణ అనంతరం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాబ్రీ మసీదును కూలగొట్టిన తర్వాత కడుతున్న మసీదులో నమాజ్ చేయడం, దాని నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వడం మంచిది కాదని అసద్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మోదీని ఆరాధిస్తున్నారు.. అందరూ మోదీ భక్తులుగా మారారన్న ఓవైసీ.. బీదర్ మున్సిపల్ ఎన్నికల ముందు ముస్లింలు, దళితులు ఐక్యంగా ఉండాలన్నారు. ముస్లింలు దళితులతో ఎప్పుడూ పోటీకి దిగొద్దన్న అసద్ ళితులను కలుపుకొని పోవాలని ముస్లింలను కోరారు. త్వరలో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయనుంది.

మత పెద్దల నుండి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తాను మాట్లాడుతున్నానని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నుండి ఉలేమా కూడా దీనిని మసీద్ అని పిలవకూడదని చెప్పారని, అక్కడ ప్రార్థనలు చెయ్యకూడదని , ఇది ఇస్లామిక్ విధానాలకు వ్యతిరేకంగా ఉందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇక ముస్లింలంతా ఏకమైతే 70 ఏళ్లుగా రాజకీయ లబ్ది పొందుతున్న వాళ్లను కూల్చగలమని వ్యాఖ్యానించిన ఓవైసీ, ఎన్నికల్లో దళితులపై ఏ ముస్లిం పోటీ చేయకూడదని సూచనలు చేశారు.

భారతదేశ 72 వ గణతంత్ర దినోత్సవం నాడే అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో ఆలయం, అదే జిల్లాలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి సంబంధించి 2019 సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దీనిని నిర్మించనున్నారు. ఐదు ఎకరాల స్థలంలో నిర్మించనున్న మసీదు కోసం విరాళాలకై మేము విజ్ఞప్తి చేశామని , ప్రజలు ఇప్పటికే సహకారం అందించడం ప్రారంభించారని ట్రస్ట్ స్పష్టం చేసింది .
Tags:    

Similar News