అజిత్ దోబాల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరు.. మరెలానో తెలుసా..!
ఈ క్రమంలో ఫోన్, ఇంటర్నెట్ వాడకంపై తన అనుభవాలను పంచుకున్నారు అజిత్ దోవల్. ఆయన ఈ రెండు వాడనని చెప్పారు!;
చాలా ఆర్మీ బేస్డ్ బాలీవుడ్ సినిమాల్లో.. అత్యున్నత అధికారులు ఫోన్లు వాడుతున్నట్లు కనిపించరు! మరికొన్ని సినిమాల్లో.. ఒక ఫోన్ ను ఒక కాల్ కి మాత్రమే వాడి.. అనంతరం దాన్ని విరిచేస్తారు! అయితే అదేమీ సినిమా లిబర్టీ కాదు! దానికి చాలా చాలా రకాల భద్రతా కారణాలు, మరికొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని అంటారు. ఈ క్రమంలో ఫోన్, ఇంటర్నెట్ వాడకంపై తన అనుభవాలను పంచుకున్నారు అజిత్ దోవల్. ఆయన ఈ రెండు వాడనని చెప్పారు!
అవును.. నేటి సమాజంలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఫోన్ వాడకుండా, అందులో ఇంటర్నెట్ లేకుండా బ్రతకగలరా అనే ప్రశ్న ఎదురైతే చెప్పే సమాధానం ఏమిటో తెలిసిందే! అయితే.. 145 కోట్ల మంది ప్రజలున్న భారతదేశానికి జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ ఢోవల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరు.. తన రోజూవారీ కార్యకలాపాల్లో వాటికి చోటివ్వరు.. అవి లేకుండానే విధులు నిర్వర్తించేలా ప్లాన్ చేసుకుంటారు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది పాల్గొన్న 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్'లో ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా అజిత్ దోవల్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా.. ఫోన్, ఇంటర్నెట్ వాడని తన లైఫ్ స్టైల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా.. తాను ఇంటర్నెట్ ఉపయోగిచని మాట వాస్తవే అని.. అంతేకాదు, తాను ఫోన్ కూడా వాడనని అజిత్ దోవల్ తాజాగా వెల్లడించారు.
అయితే ఎప్పుడైనా కుటుంబ సభ్యులు, ఇతర దేశాల్లోని వారితో మాట్లాడేందుకు అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తానని తెలిపారు. ఫోన్, ఇంటర్నెట్ లేకుండానే విధులు నిర్వర్తించేలా తన రోజును ప్లాన్ చేసుకుంటానని.. ఫోన్, ఇంటర్నెట్ కాకుండా కమ్యునికేషన్ కు చాలా మార్గాలే ఉన్నాయని.. వీటిలో ప్రజలకు తెలియనివి ఎన్నో ఉన్నాయని అజిత్ దోవల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. దీంతో.. చాలా మంది మెదళ్లలో పలు స్పై సినిమాలు కదులుతున్నాయని అంటున్నారు.
కాగా... స్వాతంత్ర్యానికి దాదాపు రెండేళ్ల ముందు 1945లో ఉత్తరాఖండ్ లో జన్మించారు అజిత్ దోవల్. ఈ క్రమంలో.. 1968లో ఐపీఎస్ లో చేరారు. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ గా ఆయన చూపిన ధైర్యసాహసాలకుగానూ ప్రభుత్వం ఆయనకు కీర్తిచక్ర అందించింది. దీంతో.. ఈ అవార్డు అందుకున్న పిన్నవయస్కుడైన పోలీస్ ఆఫీసర్ గా ఆయన రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో స్వదేశంలోనూ, విదేశంలోనూ.. దుష్ట శక్తులను నిర్మూలించే క్రమంలో ఎన్నో ఆపరేషన్స్ లో కీలక భూమిక పోషించారు. ఇందులో 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ స్ట్రైక్ మచ్చుకు ఉదాహరణలు!