జంగా సైతం రేసులోకి... పీటముడి బిగుస్తోంది

ఏపీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ ఒక రేంజిలో సాగుతోంది అన్నది తెలిసిందే. ఉన్నవి నాలుగు సీట్లు ఆశావహులు మాత్రం అధికంగా ఉన్నారు.;

Update: 2026-01-11 17:30 GMT

ఏపీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ ఒక రేంజిలో సాగుతోంది అన్నది తెలిసిందే. ఉన్నవి నాలుగు సీట్లు ఆశావహులు మాత్రం అధికంగా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీలో అయితే పోటీ వేరే లెవెల్ అని అంటున్నారు. జూన్ లో ఏపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామి రెడ్డి, పరిమళ్ నత్వాని, టీడీపీ నుంచి సానా సతీష్ రిటైర్ అవుతున్నారు. ఇందులో సానా సతీష్ గత ఏడాది మోపిదేవి వెంకట రమణ వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఖాళీ అయిన సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన పదవీ కాలం మరీ ఏడాదికి మాత్రమే పరిమితం అయింది. దాంతో ఆయనకే మరో ఆరేళ్ల పాటు ఈ పదవిని రెన్యూవల్ చేస్తారు అని అంటున్నారు.

మూడింటిలో ఒకటి టీడీపీకి :

అలా చూస్తే మిగిలిన మూడు సీట్లో మరో సీటు టీడీపీకి దక్కుతుంది. జనసేన బీజేపీ చెరొకటి తీసుకుంటాయి. ఇక టీడీపీలో ఉన్న ఒక్క సీటుకు పోటీ తీవ్రంగా ఉంది అని అంటున్నారు. మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు రాజ్యసభకు వెళ్ళాలని చూస్తున్నారు. ఆయన చాలా కాలంగా ఈ పదవి విషయంలో ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. అలాగే లోక్ సభ మాజీ ఎంపీ గళ్ళా జయదేవ్ కూడా ఈ పదవిని గట్టిగానే కోరుకుంటున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు కూడా వినిపిస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కూడా ఈ పదవి కోసం చూస్తున్నారు. ఇపుడు బీసీ కోటాలో కొత్తగా మాజీ ఎమ్మెల్యే జంగా క్రిష్ణమూర్తి రేసులోకి దూసుకుని వచ్చారు అని అంటున్నారు.

అసంతృప్తి అందుకేనా :

ఆయన వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో గురజాల టికెట్ దక్కలేదని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు టీటీడీ భోర్డు మెంబర్ పదవి దక్కింది. అయితే ఆయన గురజాల ఎమ్మెల్యే సీటుని 2029 ఎన్నికల్లో కోరుతున్నారు. కానీ అది మాతం జరిగేలా లేదని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనేకసార్లు గెలిచిన యరపతినేని శ్రీనివాసరావుకే ఆ టికెట్ అని అంటున్నారు. దాంతో జంగా క్రిష్ణ మూర్తి రాజ్యసభ రేసులోకి వస్తున్నారు అని అంటున్నారు. పెద్దల సభకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారని అంటున్నారు.

సంకేతాలు అవే :

ఇప్పటికే ఆయన ఈ దిశగా అధినాయకత్వానికి సంకేతాలు పంపించారు అని అంటున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ కి రాజీనామా వెనక వేరే కారణాలు అని ప్రచారంలో ఉన్నా ఆయన ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఎన్నికల్లో దక్కకపోతే రాజ్యసభకు పంపితే తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే అనేక మంది ఉన్న ఒకే సీటు కోసం పోటీ పడుతున్న వేళ జంగా క్రిష్ణమూర్తి కూడా అదే సీటు కోరితే అధినాయకత్వం ఏమి చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. అయితే ఆయన బీసీ వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేయవచ్చు అని అంటున్నారు. మరి ఆయన అసంతృప్తి దానితో ఆగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News