ఇరాన్ నిత్య అగ్నిగుండం.. ఎందుకంటే ?
ఇరాన్ నిత్య అగ్నిగుండంలా మారింది. ఎటు చూసినా నిరసనలే. ఆందోళనలే. రోడ్లపైకి వచ్చిన జనంపై ప్రభుత్వ అణచివేత.;
ఇరాన్ నిత్య అగ్నిగుండంలా మారింది. ఎటు చూసినా నిరసనలే. ఆందోళనలే. రోడ్లపైకి వచ్చిన జనంపై ప్రభుత్వ అణచివేత. నిరసనకారుల ప్రతిఘట. దీంతో ఇరాన్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ లో ఆర్థిక సంక్షోభం..రాజకీయ అస్థిరతకు కారణమవుతోందన్న వాదన ఉంది. వెనుజులా, గ్రీన్ ల్యాండ్ తర్వాత ప్రస్తుతం అమెరికా పరిశీలనలో ఇరాన్ ఉంది. ఇరాన్ నిరసనలకు కారణం ఏంటి ?.
ఇరాన్ లో నిరసనలకు ప్రధాన కారణం..
తీవ్ర ఆర్థిక సంక్షోభం. రాజకీయ అసంతృప్తి. ధరల పెరుగుదల. నిరుద్యోగం. కరెన్సీ పడిపోవడం. ఇవన్ని కలగలిసి ఇరాన్ పౌరులను రోడ్లపైకి తీసుకొచ్చాయి. కఠినమైన మతచట్టాలు ఇరాన్ పౌరులను అణచివేస్తున్నాయి. దీంతో మరింత ప్రతిఘటన పౌరుల నుంచి ఎదురవుతోంది. ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి కారణం అమెరికానే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా, ఇరాన్ మధ్య విబేధాలు వచ్చాక.. అమెరికా ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు విధించింది. ట్రేడ్ టారిఫ్ లు విధించింది. ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలు విధించింది. దీంతో ఇరాన్ చైనా, రష్యాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. ఇది అమెరికాకు మరింత కోపం తెప్పించింది.
రాజకీయ అసంతృప్తి
ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించడంతో డాలర్ తో పోల్చితే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోయింది. దేశంలో 40 శాతం వార్షిక ద్రవ్యోల్బణం నమోదయింది. ఎగుమతులు తగ్గాయి. ఫారిన్ కరెన్సీ నిల్వలు తగ్గాయి. ఆదాయం పడిపోయింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ఉప్పు,పప్పు, బియ్యం.. ఇలా కనీస నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజల్లో అసంతృప్తి చెలరేగింది. మరోవైపు నిరుద్యోగం వెంటాడుతోంది. దేశంలో ఉద్యోగాల కల్పన లేకపోవడంతో యువతలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు రాజకీయ అసంతృప్తి కూడా పెరిగింది. పాలకులపై తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని అణచివేయడానికి కేమాని ప్రభుత్వం కఠిన మతచట్టాలను అమలు చేస్తోంది. వీటిని ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. మరోవైపు నిరసనకారులకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. నిరసనకారులను చంపితే అమెరికా వారిని కాపాడుతుందంటూ ట్రంప్ కామెంట్ చేశారు.
మహాసా మరణంతో తీవ్రం
2022లో మహసా అమిని మరణం తర్వాత ప్రజల నుంచి తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. తమకు స్వేచ్చాయిత జీవనం కావాలని పోరాడుతున్నారు. మొరుగైన జీవనప్రమాణాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ అధికార మార్పు జరిగే వరకు ఈ పోరాటం ఆగేలా కనిపించడంలేదు. ఆయతుల్ల కేమాని ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిరసనకారులకు మద్దతుగా అమెరికా నిలబడింది. దీంతో ఇరాన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.