బాబా వంగా జోస్యం నిజమవుతోందా ?
బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి.;
బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తోంది అన్న చర్చ సాగుతోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోందా అన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. 2026 నాటికి ఒక మహా యుద్ధం జరుగుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. అంతే కాదు యూరప్ మొత్తం ఒక బంజరు భూమిగా మారుతుందని కూడా ఆమె చెప్పారు. ఇపుడు అలాంటి వాతావరణం కనిపిస్తోందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు.
మహా సంగ్రామానికి :
ఈ రోజున ప్రపంచం యుద్ధం అంచున ఉంది మహా సంగ్రామానికి తెర లేచింది. అమెరికా ఇర్జాయిల్ రెండూ కలసి ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తూంటే ఇరాన్ ఎదురు దాడిగా ఏకంగా అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తోంది. దాంతో గల్ఫ్ దేశాలలో సైతం యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. బాబా వంగా చెప్పినది కూడా సరిగ్గా ఇలాంటి జోస్యమే అంటున్నారు 2026 ప్రారంభంలో తూర్పు నుంచి మొదలైన ఉద్రిక్తతలు అన్నీ కూడా ఒక మహా యుద్ధానికి తెర తీస్తాయని ఆమె కొన్నేళ్ళ క్రితం చెప్పి ఉన్నారు. ఇపుడు ఆమె అనుచరులు ఇది తలచుకుంటున్నారు. ప్రపంచం సైతం ఆలోచిస్తోంది.
తీవ్ర నష్టంగా :
ఇక ఈ యుద్ధం తరువాత యూరప్ భూభాగం మొత్తం బంజరు గా మారుతుందని అస్థిరతతో ఇబ్బంది పడుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. అలాగే అతి పెద్ద సామాజిక ఆర్థిక సంక్షోభానికి ఈ పరిణామాలు దారి తీస్తాయని అంటున్నారు. ఈ యుద్ధం తరువాత ప్రపంచం స్వరూప స్వభావాలు అన్నీ పూర్తిగా మారిపోతాయని అంటున్నారు. దాంతో రష్యా ఒక అగ్రరాజ్యంగా ఆవిర్భవిస్తుంది అని కూడా బాబా వంగా జోస్యం చేప్పారు. రష్యా ప్రభావం విపరీతంగా ఉంటుందని అంటున్నారు.
ప్రపంచం పైన తీవ్ర ప్రభావంతో :
తాజా యుద్ధంతో ప్రపంచం మీద తీవ్ర ప్రభావం పడుతుందని బాబా వంగా చెప్పుకొచ్చారు ఇక ఇజ్రాయిల్ అమెరికాలు చూస్తే టెహ్రాన్ లో ఉన్న సుప్రీం నేత ఆఫీసుల మీద కూడా భారీ దాడులు చేశాయి. దాంతో ఇరాన్ తన గగన తలాన్ని మూసివేసింది. దీని వల్ల విమాన సర్వీసులు అన్నీ కూడా ఒక్క లెక్కన నిలిచిపోయాయి. అలాగే ప్రపంచ చమురుకు కీలకమైన హర్మూఒజ్ జల సంధిని సైతం ఇరాన్ మూసివేయడంతో భారత్ మీద ఈ చర్య తీవ్ర ప్రభావం చూపించనుంది అని అంటున్నారు. దాంతో ఈ పరిణామాలు ప్రపంచాన్ని ఏ వైపునకు తీసుకెళ్తాయి అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.