కేజ్రీ వాల్ సెకండ్ ఇన్నింగ్స్...కాంగ్రెస్ కే షాక్ ?

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ కి క్లీన్ చిట్ దక్కడంతో ఆయన మళ్లీ రాజకీయంగా దూకుడు చేస్తారు అని అంటున్నారు. అది కాస్తా బీజేపీ నెత్తిన పాలు పోసే విధంగా మారుతుందా అన్న చర్చ ఉంది.;

Update: 2026-03-01 07:23 GMT

అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో 2013లో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి అధికారం చేపట్టాక కాంగ్రెస్ మూలాలను బాగా అక్కడ నుంచి తుడిచేశారు. తిరిగి కాంగ్రెస్ కి ఢిల్లీలో రాజకీయంగా చోటు లేకుండా చేయగలిగారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆ కోపంతోనే కాంగ్రెస్ కేజ్రీవాల్ ఆప్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఇలా ఓట్ల చీలిక సైతం బీజేపీకి రాజకీయ లాభాన్ని కలిగించింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. మరో వైపు చూస్తే కేజ్రీవాల్ కూడా ఏమీ తక్కువ తినలేదు అంటారు. ఆయన వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పోటీగా బరిలోకి దిగి ఓట్ల చీలిక తెచ్చి బీజేపీకి పరోక్ష లాభం చేశారు అన్నది కూడా చెబుతారు.

ఇండియా కూటమికి దూరం :

ఇక 2022 ప్రాంతంలో దేశంలో ఇండియా కూటమిని ఏర్పాటు చేసినపుడు కేజ్రీవాల్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన పెట్టిన ప్రతిపాదన ఒక్కటే. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలకు వదిలేసి వారికి సహకరించాలని. ఆ విధంగా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పై చేయిగా ఉంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దన్నగా ఉండాలని సూచనలు చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రతీ ఎన్నికల్లోనూ పోటీ చేయడంతో ఆయన ఆగ్రహించి ఇండియా కూటమికి దూరం పాటించారు అని అంటారు.

బీజేపీ నెత్తిన పాలు :

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ కి క్లీన్ చిట్ దక్కడంతో ఆయన మళ్లీ రాజకీయంగా దూకుడు చేస్తారు అని అంటున్నారు. అది కాస్తా బీజేపీ నెత్తిన పాలు పోసే విధంగా మారుతుందా అన్న చర్చ ఉంది. వచ్చే ఏడాది జరిగే గుజరాత్ గోవా, అలాగే పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఆప్ తన బలాన్ని చూపిస్తుంది. ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ కూడా తన రాజకీయ సత్తాను తేల్చుకోవడానికి చూస్తుంది. దాంతో మధ్యలో బీజేపీకి రాజకీయ లాభం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా యూపీ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ వంటి చోట్ల జరిగే ఎన్నికల్లో కూడా ఆప్ ఒంటరిగా పోటీ చేస్తే కనుక ఇండియా కూటమికి అది ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు.

డైనమిక్ లీడర్ గా :

కేజ్రీవాల్ డైనమిక్ లీడర్ గా ఉన్నారు. ఆయన ఇండియా కూటమి నాయకత్వం మీద కూడా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ని తప్పుకుని మిత్రపక్షాలకు అక్కడ చాన్స్ ఉండాలని ఆశిస్తున్నారు. ఆయనకు కూడా జాతీయ రాజకీయాల్లో రాణించాలని బలమైన కోరిక ఉంది. ఇపుడు ఎటూ ఆయన ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు కాబట్టి జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన దేశమంతా తిరిగి తన పార్టీని పటిష్టం చేయడంతో పాటు వివిధ రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో ఆప్ ని నిలబెట్టి సత్తా చాటే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. దీని వల్ల ఇండియా కూటమిలో కాంగ్రెస్ కి అలాగే రాహుల్ గాంధీకి కూడా పెను సవాల్ గా మారే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆప్ ఎంతగా పుంజుకుంటే అంతగా కాంగ్రెస్ కి నష్టం అని అంటున్నారు. ఇండియా కూటమిలోకి ఆప్ ని చేర్చుకుని ఆయనతో కలసి అడుగులు వేస్తే సంగతేమో కానీ లేకపోతే ఆప్ ముందు కాంగ్రెస్ ఇబ్బంది పడక తప్పదని అంటున్నారు.

Tags:    

Similar News