సైలెంట్ గా స్టాలిన్ తెచ్చిన పథకం....వావ్ అంటున్న జనం

తమిళనాడులో డీఎంకే పాలన ఉంది. అక్కడ ఉచిత పధకాలు అన్నవి గత రెండు దశాబ్దాల నుంచి ఎక్కువగానే ఉన్నాయి.;

Update: 2026-01-11 15:02 GMT

తమిళనాడులో డీఎంకే పాలన ఉంది. అక్కడ ఉచిత పధకాలు అన్నవి గత రెండు దశాబ్దాల నుంచి ఎక్కువగానే ఉన్నాయి. ఇంటికి ఉచితంగా టీవీ అని ఇతరత్రా హామీలు అనీ ఇచ్చిన హామీలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అన్నా డీఎంకే డీఎంకే పోటీ పడి ఇచ్చిన ఉచిత పధకాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే 2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే తాము ఎన్నికల్లో ఇవ్వని ఒక హామీని చాలా సైలెంట్ గా అమలు చేసి దేశంలో మరోసారి బిగ్ డిస్కషన్ పెట్టేసింది. ఇంతకీ ఆ పథకం గురించి వింటేనే వావ్ అనేలా ఉంది. పండుగ వేల చేతిలో నగదుతో పాటు బట్టలు పెట్టి నిత్యావసరాలు కూడా ఇస్తూ స్టాలిన్ ప్రభుత్వం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేసింది.

రేషన్ కార్డు ఉంటే చాలు :

స్టాలిన్ ప్రభుత్వం తెచ్చిన పధకానికి రేషన్ కార్డు అర్హత. ఆ కార్డు ఉంటే చాలు ఏకంగా బొట్టు పెట్టి మరీ నజరానాలు అన్నీ ప్రభుత్వం అందిస్తోంది. ఈ పధకం కింద ఏకంగా తమిళనాడులోని 2. 23 కోట్ల మంది పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిని చేకూరుస్తోంది. ఏకంగా ఆరు వేల 936 కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఏడు వేల కోట్లతో కూడిన భారీ సంక్షేమ కార్యక్రమం అన్న మాట. ఈ పథకం కింద ప్రతీ కుటుంబానికి చేతికి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు. అలాగే కిలో బియ్యం, కిలో పంచదార, చెరకు గడ, చీర, ధోవతి, ఉచితంగా ఇస్తున్నారు. తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఎంతటి ప్రసిద్ధిగా ఉంటుందో తమిళనాడులో పొంగల్ పండుగ కూడా అంతలా జరుగుతుంది. దాంతో పండుగ వేళ పేదల ఇళ్ళలో చక్కగా హాయిగా ఆనందంగా ఉండేలా తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

రద్దీ లేకుండా ఏర్పాట్లు :

ఇక రేష దుకాణాల వద్ద సహజంగానే ఇలాంటి పథకం ఉంటే రద్దీ అధికనగా ఉంటుంది. అయితే అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ప్రభుత్వం ముందస్తుగానే ఏర్పాట్లు చేసింది. ప్రతీ రేషన్ కార్డు కలిగిన కుటుంబం ఇంటికి వెళ్ళి వారికి గత వారం రోజులుగా టోకెన్లు పంచారు. ఆ టోకెన్ల మీద వారు ఏ తేదీన వచ్చి సరుకులు నగదు తీసుకోవాలో స్పష్టంగా ఉంటుంది. దాంతో వారు హ్యాపీగా ఆ టైం కి వచ్చి తీసుకోవచ్చు. ఈ నెల 12వ తేదీ వరకూ ఈ పధకం ద్వారా ప్రభుత్వం అందించే నజరానాలు అందుకునేందుకు వీలు కల్పించారు.

ఎన్నికల కోసమేనా :

ఈ ఏడాది మధ్యలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. దాంతోనే స్టాలిన్ ప్రభుత్వం సడెన్ గా ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏకంగా రెండు కోట్లకు పైగా పేదలకు ఈ పధకం ద్వారా లబ్ది కలిగిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి నేరుగా మూడు వేల నగదు అందుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడంతో ఈ పధకం కింద నిధులు ఇలా అందించినా ఇబ్బంది ఉండదు, దాంతో ఈ పధకం కింద లబ్ది పొందిన వారిలో సగానికి పైగా జనాలు తిరిగి డీఈంకేకి ఓటేసినా కూడా మరోసారి అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుంది. దాంతో రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన స్టాలిన్ ఈ పధకాన్ని తమిళనాడు పొంగల్ కి రెడీ చేశారు అమలు అని అంటున్నారు.

Tags:    

Similar News