• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భార్య ముందే ఇంట్లో మరో...

భార్య ముందే ఇంట్లో మరో అమ్మాయితో ...చూడలేక భార్య ఆత్మహత్య !

By - Tupaki Desk
Update: 2020-06-27 01:30 GMT
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ లో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించి ఫేస్ ‌బుక్ ‌లో పోస్ట్ చేసింది. తన భర్త వేరే అమ్మాయి మోజులో పడి తనను పట్టించుకోకపోవడం, వేధింపులకు గురిచేస్తుండటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియోలో వెల్లడించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. మృతురాలి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ చావుకు అల్లుడే కారణమని ఆరోపిస్తున్నారు.

కేసులు,హోటల్స్ అంటూ బయటకెళ్లి వాడు ఆమెతో తిరుగుతున్నాడు. ఇంట్లోనే ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూసి చాలా బాధపడ్డాను. కానీ మారుతాడన్న ప్రేమతో భరిస్తూ వచ్చాను. ప్రతీరోజూ వంట చేసి, బట్టలుతికి, అన్ని విధాలుగా వాడికి అనుకూలంగా ఉన్నాను. కానీ, వాడు మాత్రం మారలేదు. ఇంకా ఇలాంటి వాడితో ప్రేమ ప్రేమ అంటూ బతికితే ఏమొస్తుంది. అందుకే నేను చనిపోతున్నా. వాడిని ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు. వాడు చేసిన కర్మలు,వాడిపై ఉన్న కేసులే వాడిని తీసుకుపోతాయి. అమ్మానాన్న.. తల్లిదండ్రులుగా మీరు నాకు ఎక్కువే ఇచ్చారు. కానీ నేనే మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోతున్నాను అని మృతురాలు లావణ్య సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది.

ఈ ఘటన పై మృతురాలి తండ్రి ఏమంటున్నారు... సార్.. వాడు మా ఇంటికొచ్చి అమ్మాయిని ప్రేమిస్తున్నాను,పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. 2012, జులైలో పెళ్లి జరిగింది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. మొదట్లో వాడికి జాబ్ కూడా లేదు, ఎలాంటి ఆర్థిక అండ లేదు. నా కూతురు ఉద్యోగం చేసి వాడిని సాకింది. వెళ్లినప్పుడల్లా నేనో పాతికవేలు ఇచ్చేవాడిని. సెప్టెంబర్ ‌లో నా కూతురికి ఆరో నెల ఉన్నప్పుడు, పొట్టపై కాలితో తన్ని దాడి చేశాడు. జుట్టపట్టుకుని ఈడ్చి ప్రెగ్నెన్సీ పోయేటట్టు చేశాడు. ఇప్పుడేమో చెన్నైకి చెందిన మరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని మృతురాలి తండ్రి వాపోయారు. అలాగే, తమ కుమార్తె ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో చూసి తెలిసినవాళ్లు తమకు ఫోన్ చేశారని లావణ్య తల్లి అన్నారు. ఆస్పత్రిలో చేర్పించారని... సీరియస్‌గా ఉందని చెప్పారన్నారు. కానీ ఆ తర్వాత కాసేపటికే మృతి చెందిందన్న విషయం తెలిసిందని వాపోయారు.తమ అల్లుడి కారణంగానే కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

శంషాబాద్ రాళ్లగూడకు చెందిన లావణ్య(32)కు వెంకటేశం అనే యువకుడితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. పెళ్లయిన కొద్దిరోజులు ఖాళీగానే ఉన్న వెంకటేశంకు ఆ తర్వాత జెట్‌ ఎయిర్‌ వేస్‌ పైలట్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పటినుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. వేరే అమ్మాయి ఒకరితో సంబంధం పెట్టుకుని లావణ్యను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయమై ఇద్దరికీ గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. ప్రేమించినవాడు మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
Tags:    
  • Women suicide 
  • Shamsabad 
  • Lavanya 
  • Venkatesam 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS