ముంబయి నడివీధిలో భర్త తాట తీసిన మహిళ
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఎలాంటి ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకున్నా తెలుసుకునే వీలు కలుగుతుంది. తాజాగా ముంబయిలోని జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ఒక రోడ్డులో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఒక సంపన్న మహిళ.. తన భర్త చేసే తప్పుడు పనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటమే కాదు.. నడి రోడ్డు మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదంటున్నారు.
శనివారం సాయంత్రం ఐదు గంటల వేళలో.. ఖరీదైన బ్లాక్ ఎస్ యూవీ కారుకు మరో ఖరీదైన తెల్లటి కారు పక్కగా వచ్చింది. ఆ కారులో నుంచి బయటకు దిగిన ఒక మహిళ తీవ్ర ఆగ్రహంతో.. కారు డోర్లు తీసే ప్రయత్నం చేసింది. కారులోని వారు బయటకు రాలేదు సరికదా మౌనంగా ఉండిపోయారు. కోపంతో ఉన్న ఆమె.. కారు బాయనెట్ ఎక్కి చెప్పుతో అద్దాన్ని కొట్టింది. సంపన్న మహిళగా కనిపించిన ఆమె ఎందుకలా చేస్తుందన్నది ప్రశ్నగా మారింది.
తన భర్త వేరే మహిళతో సాగిస్తున్న సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆమె.. అతనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బిజీగా ఉండే రోడ్డు మీద రెండు కార్లు పక్కపక్కనే ఆగిపోవటంతో ట్రాఫిక్ జాం అయ్యింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు సైతం కాసేపు మహిళను అడ్డుకోలేదు. ఆమె పని ఆమె చేస్తుంటే.. పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే ప్రయత్నంలో మునిగిపోయారు.
కాసేపటికి రెండు కార్లను పక్కకు పెట్టాలని కోరారు. తన భర్త ఎప్పటి నుంచో వివాహేతర సంబంధం పెట్టుకున్న అనుమానంతోనే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం కోసం తానీ పని చేసినట్లుగా మహిళ చెప్పింది. భర్త మీద కేసు పెడతారా? అని పోలీసులు అడిగితే.. అక్కర్లేదని.. అతనితో తనకిక సంబంధం లేదని తేల్చేసింది. ట్రాఫిక్ జామ్ కు కారణమైనందుకు ఫైన్ కట్టాలంటే.. సదరు ఫైన్ కట్టిన మహిళ భర్త మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై సదరు బ్లాక్ కారులో ఉన్న పెద్ద మనిషి స్పందన ఏమిటన్న విషయం మీద పలువురు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
Full View Full View Full View