ఇరు వర్గాలు రాళ్లదాడిలో మహిళ మృతి, వెలగపూడిలో ఉద్రిక్తత... ఎంపీ పై ఫైర్ !

Update: 2020-12-28 08:30 GMT
వెలగపూడిలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి ఓ కాలనీ పేరును సూచించే ఆర్చ్‌ నిర్మాణ విషయంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాళ్లు రువ్వడంతో వెలగపూడి ఎస్సీ కాలనీ కి చెందిన మెండం మరియమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. సోమవారం మెండం మరియమ్మ మృతదేహంతో గ్రామస్థులు, కుటుంబీకులు వెలగపూడి లో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

మహిళ మృతదేహాన్ని సందర్శించేందుకు ఎంపి నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, హోం మినిస్టర్‌ సుచరిత లు అక్కడికి చేరుకున్నారు. మృతురాలి భౌతిక కాయాన్ని సందర్శించారు. అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేస్తూ డౌన్‌, డౌన్‌ నందిగామ సురేష్‌ అంటూ స్లొగన్స్‌ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య కొద్దిపాటి తోపులాట చోటుచేసుకుంది. మృతురాలి భౌతికకాయాన్ని ఎంపి నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, హోం మినిస్టర్‌ సుచరితలతోపాటు మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, దళిత సంఘాల నేతలు సందర్శించారు. అక్కడ నందిగం సురేష్‌ వెనక్కి వెళ్లిపోవాలంటూ కొందరు నినాదాలు చేశారు. రెండు వర్గాలకు సర్థి చెప్పేందుకు హోంమంత్రి ప్రయత్నిస్తున్నారు
Tags:    

Similar News