• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆయన కూడా తెలుగుదేశాన్ని...

ఆయన కూడా తెలుగుదేశాన్ని వదిలేస్తున్నట్టేనా?

By - Tupaki Desk
Update: 2019-03-03 10:56 GMT
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నూకలు చెల్లిపోయినట్లే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకటవీరయ్య ఈ రోజు టీ ఆర్ ఎస్ లో చేరగా మరో ఎమ్మెల్యే కూడా టీ ఆర్ ఎస్  లో చేరడానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అయితే వీరే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా గట్టి అండగా ఉండే నేత ఒకరు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వినిపిస్తోంది.
    
ఒకప్పుడు లోక్‌ సభలో తెలుగుదేశం పార్టీ సభాపక్ష నేతగా పనిచేసిన నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. అయితే ఏ పార్టీలో చేరాలనే దాని పై నామా ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ సీనియర్ లీడర్‌ ను టీ ఆర్ ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ సంప్రదించడంతో ఆయన నిన్నమొన్నటి వరకు డైలమాలో ఉన్నారని... అయితే, కార్యకర్తలంతా ఆయన్ను కాంగ్రెస్‌ లోకివెళ్లమని సూచిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరోలో ఉన్న నామా పార్టీకి ఆర్థికంగా గట్టి మద్దతుదారన్న సంగతి తెలిసిందే. నాగేశ్వరరావు రాజకీయాలలోకి రాకముందు నుంచి వ్యాపారవేత్త. మధుకాన్ కంపెనీ అధిపతి అయిన ఆయనకు గ్రానైట్, పవర్ జనరేషన్ కంపెనీలున్నాయి. 2009లో లోక్ సభకు పోటి చేసిన సమయంలో తన ఆస్తుల విలువ 173 కోట్లుగా ప్రకటించారు. అప్పుడు లోక్ సభకు పోటి చేసిన వారందరిలో అత్యధిక ధనవంతుడుగా ఆయన వార్తల్లో నిలిచారు.
    
2004 లో ఖమ్మం నుంచి టిడిపి ఎంపీగా పోటి చేసి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు. లక్ష ఓట్ల మెజార్టీతో నామా పై రేణుక విజయం సాధించారు. తిరిగి 2009 లో పోటి చేయగా 1,25,000 ఓట్ల మెజార్టీతో నామా నాగేశ్వరరావు రేణుకా చౌదరి పై గెలుపొందారు. 2014 లో ఖమ్మం నుంచి వైసిసి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీ ఆర్ ఎస్ గాలి వీచినా ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంది. ఆ కారణంగానే ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని సూచిస్తున్నట్లు సమాచారం. నామా కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:    
  • Nama Nageswara Rao 
  • TDP 
  • Telugu News 
  • Latest News 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS