• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లలిత్ మోడీ జీవిత రహస్యాలు...

లలిత్ మోడీ జీవిత రహస్యాలు బయటపెట్టిన వీకీ పీడియా..

By - Tupaki Desk
Update: 2022-07-24 02:30 GMT
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ కుమార్ మోడీ, మాజీ విశ్వ సుందరి సుందరి సుస్మితా సేన్ ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి మాల్దీవుల్లో దిగిన ఫొటోలను లలిత్ మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు. లేటు వయసులో ఘాటు ప్రేమంటూ అప్పటి నుంచి నెటిజన్లు వీరిపై సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా  ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్న లలిత్ కుమార్ మోడీ గురించి తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు. లలిత్ కుమార్ మోడీ  లైఫ్ స్టోరీని వీకీ పిడియా నెట్టింట్లో ఉంచింది. ఇందులో ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు డ్రగ్స్ కొనుగులో చేసేందుకు ప్రయత్నించాడన్న విషయం రాసింది. కొందరు ఆయన గురించి తెలుసుకునే క్రమంలో ఈ విషయం బయటపడడంతో ఆ పేజీనీ స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో అసలు లలిత్ కుమార్ మోడీ ఎవరు..? ఆయన వ్యాపార జీవితం ఏంటి..? అనే విషయంపై చర్చించుకుంటున్నారు.

ఢిల్లీలోని ప్రముఖ వ్యాపార కుటుంబంలో 1963 నవంబర్ 29న లలిత్ కుమార్ మోడీ జన్మించారు. కృష్ణకుమార్ మోడీ-బీనీ మోడీ ఆయన తల్లిదండ్రులు. 90వ దశకంలో స్పోర్ట్స్ పే ఛానెళ్లను డిస్ట్రిబ్యూటర్ గా మారి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తిరించాడు. 2005లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు.

అప్పుడే అతని పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఐసీసీ వలసవాద పక్షపాదాన్ని కొనసాగిస్తుందని ఆరోపించారు. దీంతో అతనపై నిరసన స్వరాలు మొదలయ్యాయి. ఆ తరువాత 2008లో ఐపీఎల్ ను సృష్టించాడు. 2010 వరకు దీనికి చైర్మన్ గా కొనసాగారు. ఆ తరువాత పలు వివాదాలతో బయటికి వెళ్లాడు.
 
తాజాగా ఆయన సుస్మితా సేన్ తో డేటింగ్ చేస్తున్నానని చెప్పడంతో ఆయన గురించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన గురించి వీకీలో ఉన్న ప్రకారం.. మోడీ అమెరికాలో రెండు యూనివర్సిటీల్లో చదువును కొనసాగించాడు. న్యూయార్క్ లోని పేస్ యూనివర్సిటీలో రెండేళ్లు, నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీలో ఒక సంవత్సరం విద్యనభ్యసించాడు.

ఆయన చదువుకునే రోజుల్లో మోడీకి ముగ్గురు స్నేహితులు. వీరు ఒక హోటల్ లో పదివేల డాలర్లకు అరకిలో కొకైన్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని రాసి ఉంది. అయితే మత్తుమందు విక్రేత  షాట్ గన్ తో బెదిరించి వారి దగ్గరున్న డబ్బును దోచుకున్నట్లు పేర్కొంది. ఇక ట్రాఫిక్ కొకైన్, దాడి, కిడ్నాప్ నకు కుట్ర పన్నినందుకు మోడీని అరెస్టు చేసినట్లు వీకీలో పేర్కొంది.

లలిత్ మోడీ గురించి ఈ విషయం బయటికి రావడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఆయన ఫన్నీ అని.. అతనిని సుస్మితా సేన్ ఎలా ఇష్టపడిందో అర్థం కావడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే అతని బ్యాక్రౌండే ఇంత వరస్ట్ గా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందని మరికొందరు మెసేజ్ లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా లలిత్ మోడీ జీవిత రహస్యాలను బయటపెట్టడమే పనిగా పెట్టుకున్నారు కొందరు. అయితే లలిత్ మోడీ  ఈ ఆరోపణలపై ఏవిధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.
Tags:    
  • Lalithmodi 
  • Sushmithasen 
  • IndianPPremierLeague 
  • Chairman 
  • London 
  • Drugs 
  • Wikipedia 
  • Socialmedia 
  • Cocaine 
  • Comments 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS