దుబాయ్ రాజు భార్య ఇలా పారిపోయింది..

Update: 2019-07-01 05:26 GMT
ఇటీవలే గల్ఫ్ చట్టాలతో జైలు పాలైన హైదరాబాదీ యువకుడి వ్యథ అందరినీ కలిచివేసింది. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు దుబాయ్ లో ఉద్యోగం సంపాదించి మూడేళ్లుగా చేస్తున్నాడు. అక్కడే పరిచయమైన ఓ దుబాయ్ కు చెందిన యువతితో పరిచయం ప్రేమగా మారింది.  ఆ తర్వాత యువతిని హైదరాబాద్ తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. తిరిగి దుబాయ్ వెళ్లగానే అతడిని ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేశారు. బయటకు వచ్చే వీలు లేకుండా జీవితాంతం జైలులోనే ఉంచేలా కఠిన చట్టాలు వేశారు. దీంతో దుబాయ్ యువతిని పెళ్లి చేసుకున్న నేరానికి ఆ యువకుడి జీవితం అంధకారమైంది.

ఇది గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలియజెప్పింది. విదేశీయులైన యువతులను గల్ఫ్ యువకులు పెళ్లి చేసుకుంటే ఎలాంటి తప్పు లేదు. కానీ గల్ఫ్ దేశ ముస్లిం అమ్మాయిలను విదేశీ యువత పెళ్లి చేసుకుంటే మరణ శాసనమే. అక్కడ దీనిపై కఠిన చట్టాలు, ఆంక్షలున్నాయి. ఈ విషయం తెలియని హైదరాబాదీ జీవితం అతలాకుతలమైంది.

ఇప్పుడు సామన్యులకే కాదు.. దుబాయ్ రాజుకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దుబాయ్ సహా గల్ఫ్ దేశాల్లో మహిళల స్వేచ్ఛపై దారుణ కఠిన నిబంధనలుంటాయి. అయితే దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తమ్ ఆరో భార్య అయిన హయా బింత్ అల్ హుస్సేన్ ఈ ఆంక్షలు, కట్టుబాట్లను కాలదన్ని ఏకంగా 270 కోట్లతో విదేశాలకు పారిపోవడం సంచలనంగా మారింది. జోర్డాన్ దేశ రాజు సవతి సోదరి అయిన ఈమె ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివింది. ఈ గల్ష్ దేశరాజు ఆరోభార్యగా ఆంక్షలు, కట్టుబాట్ల మధ్య ఉండలేక జర్మనీ దౌత్యవేత్త సాయంతో దేశం దాటి తన ఇద్దరు పిల్లలతో ఉడాయించడం సంచలనంగా మారింది. ఈమె ఇదివరకే రాజు, చట్టాల ను చూసి విడాకులను కోరిందట.. ఇప్పు లండన్ కు లేదా జర్మనీకి పారిపోయి ఉంటుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News