భార్యను పొగిడినందుకు డిస్కౌంట్లట!

Update: 2016-09-18 05:00 GMT
డిస్కౌంట్లలో ఇండియాలో ఉన్నన్ని కోణాలు ఎక్కడా ఉండవేమో. ఏ సందర్భాన్ని అయినా వ్యాపారాత్మకం చేసి వినియోగదారులను ఆకర్షించడం మన వాళ్లకు బాగా అబ్బిన విద్య. ఈరోజు "వైఫ్ అప్రిషియేషన్ డే" నగరంలోని ఓ రెస్టారెంటు దీనిని కూడా జరుపుకుంటోంది. చక్కటి తెలుగు పేరుతో అమీర్ పేట‌లో నిర్వహిస్తున్న *తాలింపు* రెస్టారెంట్ సెప్టెంబరు మూడో ఆదివారం (ఈరోజే) 'వైఫ్ అప్రిసియేష‌న్ డే'ను జ‌రుపుకుంటోంది. ప్ర‌తి ఏటా ఈ రోజును ప్ర‌పంచ వ్యాప్తంగా భార్య‌ను పొగిడే దినోత్స‌వంగా జరుపుకోవ‌డం ఆన‌వాయితీ. అయితే, ఈ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని *తాలింపు* రెస్టారెంట్ ఓ క్రేజీ ఆఫ‌రును ప్ర‌క‌టించింది.  

ఈ ఆఫ‌రులో పాల్గొనాలంటే భార్య‌ను పొగుడుతూ ఒక క‌విత రాసి హోటల్లో భార్యకు వినిపించి ఆ స్లిప్ బేరర్ కు ఇవ్వాలట.  షరతు ఏంటంటే క‌విత నిడివి క‌నీసం ఆరు లైన్లు ఉండాలి. గ‌రిష్టంగా ఎన్నిలైన్ల‌యినా ఉండొచ్చు. ఇలా భార్యను పొగిడితే మీరు చేసే బిల్లుపైన మీ కవిత్వ స్థాయిని బట్టి మంచి డిస్కౌంట్ ఇస్తారట. భార్యలకు ఈ వార్త తెలిస్తే పొగిడించుకునే అవకాశం మిస్ చేసుకుంటారా? అసలే ఇండియన్ మిసెస్ లకు డిస్కౌంట్లంటే ప్రీతి. అంటే రెండు విషయాలు ఇష్టమైనవే. ఈ ఆఫరు సెప్టెంబరు 18 వ తేదీ మాత్రమే అని నిర్వహకులు తెలిపారు.
Tags:    

Similar News