జగన్ చెన్నై టూర్- చిదంబర రాజకీయమేంటో ?
చెన్నై వేదికగా జరిగిన వివాహ సందర్భంలో మాత్రం జగన్ కాంగ్రెస్ పెద్దలతో పాటు అక్కడి డీఎంకే నేతలు సీఎం స్టాలిన్ సహా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఇలా ఎంతో మందిని కలిశారు ఒక విధంగా తమిళనాడు రాజకీయాన్ని జగన్ చుట్టేశారు అని చెప్పాలి.;
నిజానికి చూస్తే జగన్ అన్న కుమారుడి పెళ్ళి. పైగా వధువు వైపు వారు కూడా వైసీపీలో కీలకమైన మేకపాటి ఫ్యామిలీకి చెందిన వారు. ఆ విధంగా ఈ వివాహంలో రాజకీయ కళ అయితే ఎంతో ప్రస్ఫుటంగా కనిపించింది. జగన్ ఒక రోజు ముందుగానే చెన్నై చేరుకున్నారు. ఇక ఆదివారం అంతా ఈ వేడుకల ముచ్చట్లే సాగాయి. వచ్చిన అథిదులతో జగన్ ముచ్చట్లు హగ్ లు మంతనాలు అన్నీ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. జగన్ ఎపుడూ ఏ ఫంక్షన్ లోనూ ఇంతసేపు ఉండలేదు, అంతే కాదు ఒకేసారి ఇంతమంది ప్రముఖులను కూడా కలవలేదు. కానీ చెన్నై వేదికగా జరిగిన వివాహ సందర్భంలో మాత్రం జగన్ కాంగ్రెస్ పెద్దలతో పాటు అక్కడి డీఎంకే నేతలు సీఎం స్టాలిన్ సహా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఇలా ఎంతో మందిని కలిశారు ఒక విధంగా తమిళనాడు రాజకీయాన్ని జగన్ చుట్టేశారు అని చెప్పాలి.
ఇండియా కూటమితోనే :
ఇక ఈ వివాహ వేడుకలకు ఇండియా కూటమి నుంచి నేతలు అంతా హాజరు అయ్యారు. డీఎంకే కాంగ్రెస్ నేతలే అంతా కనిపించారు. ఇక ఏపీ నుంచి చూస్తే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వంటి వారు హాజరయ్యారు. అలాగే సినీ నటుడు మోహన్ బాబు కూడా ఈ వేడుకలలో కనిపించి జగన్ తో మీట్ కావడం మరో ఆసక్తికరమైన సన్నివేశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కాంగ్రెస్ అగ్ర నేతలతో ముచ్చట్లు పెట్టడం మరో విశేషం.
చిదంబరంతో కలసి :
ఈ వేడుకలకు హాజరైన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ అగ్ర నేత పి చిదంబరం జగన్ కలిసి ముచ్చటించుకోవడం అందరికీ ఆసక్తిగా కనిపించింది. జగన్ కాంగ్రెస్ వీడాక ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరితోనూ బాహాటంగా కలిసింది లేదు, అఫ్ కోర్స్ ఇది పెళ్ళి వేడుక పైగా తమ ఇంట్లో కార్యక్రమం. దాంతో జగన్ వారితో భేటీ వేశారు అనుకున్నా ఇపుడున్న ఏపీ రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ చూస్తే కేవలం వివాహ వేడుకల సమావేశాలుగా చూడలేమని అనే వారు ఉన్నారు. రాజకీయ విశ్లేషణలు అలాగే ఉన్నాయి. మరి చిదంబరంతో జగన్ ముచ్చట్లు అంటే బిగ్ ట్విస్ట్ గానే చూడాలని అంటున్న వారూ ఉన్నారు.
కేవీపీతో సైతం :
అదే విధంగా జగన్ కేవీపీ రామచంద్రరావు కలుసుకోవడం మరో కీలక పరిణామం. నిజానికి వైఎస్సార్ కి ఆత్మగా కేవీపీ ఉంటూ వచ్చారు. ఆ కుటుంబంలో కేవీపీ పాత్ర బంధువుల కంటే ఎక్కువే. కానీ జగన్ కాంగ్రెస్ ని వీడాక కేవీపీతో బాహటంగా కలిసిన సందర్భాలు పెద్దగా లేవు, కానీ చెన్నై వేడుకలో మాత్రం అంకుల్ హౌ ఆర్ యూ అంటూ జగన్ ఆయన్ని హగ్ చేసుకోవడం కేవీపీ కూడా జగన్ తో ఆప్యాయంగా మాట్లాడటం చూస్తే రాజకీయంగా కూడా చర్చకు వచ్చేలాగానే ఉంది.
ఇండికేషన్స్ ఇస్తాయా :
రాజకీయాల్లో ప్రతీ కదలికకూ ఒక అర్ధం ఉంటుంది. ఒక సంకేతం ఉంటుంది, ఏదీ వేస్ట్ గా ఉండదు, అలా ఎవరూ చూడలేరు, ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసినా కూడా ఈ మాటలూ ముచ్చట్లూ ఎక్కడో ఒక చోట లింక్ అయ్యే సందర్భాలు ఉంటాయని అంటున్నారు. ఇండీ కూటమికి అతి పెద్ద దిక్కుగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. ఆయన జగన్ తో భేటీ అయ్యారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలు అంతా కలిశారు. రేపటి రాజకీయాల్లో తన ప్రభావం చూపించబోయే విజయ్ కూడా జగన్ తో మంతనాలు జరిపారు ఇవన్నీ చూస్తూంటే జాతీయ స్థాయిలో పరిణామాలు కానీ ఏపీ రాజకీయాలు కానీ ఎక్కడో ఒకచోట చేంజ్ అయ్యేలా ఉంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది. జగన్ రోజంతా ఒక కార్యక్రమంలో ఉండడం అందరితోనూ కలసి నవ్వుతూ మాట్లాడడం అన్నది చూస్తే చెన్నై చెప్పే చిదంబర రాజకీయం ఏంటి అన్నదే ఒక చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.