దేశం ఉడికిపోతుంటే టాలీవుడ్ మౌనం ఎందుకు? స్టార్ హీరోలపై పెరుగుతున్న ప్రశ్నలు

విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డా, లాఠీలు విరిగిపడ్డా మన బాక్సాఫీస్ "సుప్రీమ్ హీరోలు" మాత్రం గప్‌చుప్‌... హిట్లు కొట్టేటప్పుడు ఉండే ఆవేశం, సమాజం వైపు వచ్చేసరికి ఏమైంది భయ్యా? అన్న ప్రశ్నలు ఇప్పుడు యువత నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

Update: 2026-07-25 06:51 GMT

విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డా, లాఠీలు విరిగిపడ్డా మన బాక్సాఫీస్ "సుప్రీమ్ హీరోలు" మాత్రం గప్‌చుప్‌... హిట్లు కొట్టేటప్పుడు ఉండే ఆవేశం, సమాజం వైపు వచ్చేసరికి ఏమైంది భయ్యా? అన్న ప్రశ్నలు ఇప్పుడు యువత నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

రీల్ హీరోస్... రియల్ గాయాలు

దేశంలో ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజీలు, జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల అరుపులు, పోలీసుల లాఠీఛార్జ్‌లతో వాతావరణం బాగా వేడెక్కిపోయింది. భవిష్యత్తు ఏమవుతుందో తెలియక వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి ఏడుస్తుంటే... "మా సినిమా విడుదల వాయిదా పడింది" అని కూడా విచారించలేని అంతటి తీవ్రమైన 'మౌన వ్రతం'లో మునిగిపోయారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు! సినిమాల్లో విలన్ వ్యవస్థను ఒక్క డైలాగ్‌తో కూల్చేసే మన కథానాయకులు, రియల్ లైఫ్‌లో కనీసం ఒక్క 'ఎక్స్' పోస్ట్ వేయడానికి కూడా అంగుళం వేలు కదపకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్..

కోలీవుడ్ 'సింగం'... టాలీవుడ్ 'సైలెంట్'?

పక్క రాష్ట్రాలకు వెళ్తే సీన్ వేరేలా ఉంది. కోలీవుడ్ లో కమల్ హాసన్, వెట్రిమారన్, పా. రంజిత్ లాంటి వాళ్లు ఏకంగా మైకులు పట్టుకుని రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. బాలీవుడ్ లో అక్కడ కొందరు కనీసం "ఇది తప్పు కదా స్వామీ" అని సోషల్ మీడియాలో స్టేట్‌మెంట్లు ఇచ్చారు. టాలీవుడ్ లో మాత్రం ప్రశాంతత... శ్మశాన నిశ్శబ్దం.. "స్క్రీన్ మీద సీమను ఏలేస్తాం, వ్యవస్థను మార్చేస్తాం అని చెప్పే బిల్డప్‌లు ఓకే కానీ... నిజంగా దేశంలో మంటలు మండుతున్నప్పుడు ఈ "కామ్‌నెస్" ఏంటో సామీ" అని నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు.

శేఖర్ కమ్ముల.. "అయ్యో... నేనొక్కడినేనా?"

ఈ నిశ్శబ్దంలో కాస్త ధైర్యం చేసి దర్శకుడు శేఖర్ కమ్ముల బయటకొచ్చి "విద్యార్థులను గెలిపించే బాధ్యత ప్రభుత్వాలదే, వాళ్ల విజయే దేశ విజయం" అని కాస్త గట్టిగానే మాట్లాడారు. ఆయన మాటలు వైరల్ అవ్వడమే ఆలస్యం... మిగతా పెద్ద తలకాయలు ఆయన వైపు "వీడికెందుకు ఈ అనవసరమైన రచ్చ?" అన్నట్టు చూస్తున్నారా అని ట్రోలర్లు సెటైర్లు వేస్తున్నారు.

ఈ 'మౌనం' వెనుక సీక్రెట్ ఏంటి?

టాలీవుడ్ లోకం ఈ రేంజ్ శాంతి మంత్రం పఠించడానికి కారణాలు ఏమై ఉంటాయని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. నోరు విప్పితే ఏ ప్రభుత్వం నుంచి 'థియేటర్ల టికెట్ ధరల సమస్య' వస్తుందో అని భయం వెంటాడుతోందా..? టీజర్ విడుదల ఉన్నప్పుడు మాత్రమే వేళ్లు పోస్టులు పెట్టడానికి కదులుతాయా? అని ప్రశ్నిస్తున్నారు.

'స్టార్' వ్యూవ్స్ vs 'పబ్లిక్' పంచ్‌లు

ఒక వర్గం మాత్రం "అసలు ప్రతీ దానికి సినీ సెలబ్రిటీలు ఎందుకు స్పందించాలి బాస్? వాళ్ల పని వాళ్లు చేసుకోనివ్వండి" అని సపోర్ట్ చేస్తుంటే... ఇంకో వర్గం మాత్రం " కోట్ల రూపాయల కలెక్షన్లు ఇచ్చే ప్రజలకు కష్టం వస్తే మాట్లాడలేని వాళ్లు... తెరపై 'సమాజ సేవకులు'గా నటించడం ఆపితే మంచిది" అని గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు.

భవిష్యత్తులో మన స్టార్ హీరోలు ఈ సైలెన్స్‌ని బ్రేక్ చేసి ఏమైనా రియాక్ట్ అవుతారా? లేక "మాకు సంబంధం లేదు బాబోయ్" అని షూటింగ్‌లలో బిజీ అయిపోతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ..



Tags:    

Similar News