ముగ్గురు మైనర్ల ఆత్మహత్య కేసు.. తెరపైకి తండ్రి లివ్-ఇన్ పార్టనర్ సుసైడ్ టాపిక్!

అవును... ఘజియాబాద్ లో ముగ్గురు మైనర్ సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్న కేసులో దర్యాప్తుకు కొత్త కోణాన్ని జోడించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది.;

Update: 2026-02-08 23:30 GMT

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) అక్కాచెల్లెల్లు తమ నివాస భవనంలోని తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా తమ ఆత్మహత్యలకు గల కారణాలను ఓ డైరీలో వెల్లడించారు. ఈ సమయంలో ఆ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. వారి తండ్రి చేతన్ కుమార్ 2015లో జరిగిన మరో ఆత్మహత్య కేసులో నిందితుడనే విషయం తెరపైకి వచ్చింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు!

అవును... ఘజియాబాద్ లో ముగ్గురు మైనర్ సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్న కేసులో దర్యాప్తుకు కొత్త కోణాన్ని జోడించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు సోదరీమణుల తండ్రి 2015లో జరిగిన మరో ఆత్మహత్య కేసులో నిందితుడని పోలీసులు నిర్ధారించారు. ఆ కేసులో అతని సహచరుడు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ట్రాన్స్ హిండన్ డీసీపీ నిమిష్ పాటిల్ ఆ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన డీసీపీ నిమిష్ పాటిల్... 2015లో సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్ర నగర్ కాలనీలోని ఒక ఫ్లాట్ పైకప్పు నుంచి పడి చేతన్ కుమార్ తో కలిసి నివసిస్తున్న భాగస్వామి మరణించారని తెలిపారు. అయితే.. ఆ మరణాన్ని తొలుత అనుమానాస్పద మృతిగా పరిగణించినప్పటికీ.. దర్యాప్తు అనంతరం ఆత్మహత్యగా ప్రకటించినట్లు వెల్లడించారు. ఆ కేసును తాజాగా ముగ్గురు మైనర్ సిస్టర్స్ కేసుతో ముడిపెట్టి చూడటానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... చేతన్ కుమార్ కు ముగ్గురు భార్యలు ఉన్నారని.. వారంతా జీవ సంబంధమైన సోదరీమణులని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న నిషిక తల్లి ఒకరు కాగా.. మిగిలిన ఇద్దరి తల్లి మరొకరని తెలిపారు! ఈ నేపథ్యంలో.. ఫ్యామిలీ నిర్మాణం, కుటుంబ వాతావరణం పిల్లల మానసిక ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం చూపించిందా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారని అంటున్నారు!

ఇదే సమయంలో.. వారి తండ్రి వారి నుంచి మొబైల్ ఫోన్ లను తీసేసుకున్న తర్వాత ముగ్గురు సోదరీమణులూ బాధపడ్డారని పునరుద్ఘాటించిన పోలీసులు... కొరియన్ యాప్ లు, ఆన్ లైన్ గేమ్ లు, విదేశీయులతో స్నేహాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గ్రహించిన తర్వాత ఆ ఫోన్ లను లాక్కొని, అమ్మెశాడని తెలిపారు! అయితే.. సంఘటన జరిగిన రాత్రి బాలికలు తమ తల్లి ఫోన్ ను తీసుకున్నప్పటికీ.. అందులో కొరియన్ అప్లికేషన్స్ ను యాక్సెస్ చేయలేకపోయారని అన్నారు.

Tags:    

Similar News