సచివాలయంలో గుడి.. మసీదు మాత్రమే కాదు చర్చి కూడానట
తన కలల సచివాలయాన్ని నిర్మించేందుకు గడిచిన కొంతకాలంగా రిస్కు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎట్టకేలకు సచివాలయం విషయంలో తాను కోరుకున్నది సాధించారనే చెప్పాలి. కూల్చివేత ప్రక్రియకు బ్రేకులు వేస్తూ తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేకులు వేసి.. కేసీఆర్ కోరుకున్నది జరగటం మాత్రం ఖాయమంటున్నారు. సచివాలయాన్ని కూల్చివేసే క్రమంలో గుడి.. మసీదు విషయంలో ఎదురైన పరిణామాలపై సీఎం ఇప్పటికే వేదనను వ్యక్తం చేయటం తెలిసిందే.
కొత్త సచివాలయ ప్రాంగణలో భారీ గుడి.. మసీదును ఏర్పాటు చేస్తామని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే..తాజాగా మరో కొత్త డిమాండ్ తెర మీదకువచ్చింది. తెలుగు చర్చిల ఫెడరేషన్ కొత్త డిమాండ్ ను వినిపిస్తోంది. కొత్త సచివాలయ ప్రాంగణంలో గుడి.. మసీదులతో పాటు.. చర్చిని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పాత సచివాలయంలో ఇప్పటికే చర్చిను నిర్వహిస్తున్నారని.. అందుకే కొత్త సచివాలయంలోనూ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ప్రతి బుధవారం లంచ్ బ్రేకులో కె బ్లాక్ లోని హాల్లో చర్చి సేవల్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చర్చి హాల్ ను ప్రారంభించారని చెబుతున్నారు. ఎల్ బ్లాక్ కు ఎదురుగా ఉన్న ఈ చర్చి సేవలు ఇటీవల కాలం వరకు సాగించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయంకూల్చివేత నేపథ్యంలో అన్ని బ్లాక్ లను కూల్చివేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో గుడిని.. మసీదును సరికొత్తగా నిర్మిస్తానని హామీ ఇస్తున్న నేపథ్యంలో.. చర్చిని విషయంలోనూ హామీ ఇవ్వాలని కోరుతున్నారు. మరి.. ఈ డిమాండ్ మీద సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.