• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లగడజగడం.. గందరగోళం.. ఈ...

లగడజగడం.. గందరగోళం.. ఈ సర్వే షాకేనా?

By - Tupaki Desk
Update: 2018-12-08 14:30 GMT
ఎన్నికల ముందు లగడపాటి నిర్వహించిన ప్రెస్ మీట్లలో చాలా జోష్ గా.. ఆనందంగా ఉత్సాహంగా కనిపించారు. కానీ ఎన్నికల తర్వాత చెప్పిన తన సర్వేలో మాత్రం ఒకింత ఆందోళన - గందరగోళం.., తికమక పడుతూ కనిపించాడు. ఆయన ఉన్నట్టే చెప్పిన సర్వే కూడా గందరగోళంగానే చెప్పేశాడు. ఎప్పుడూ లగడపాటి చెప్పే సరైన లెక్కలు తెలంగాణ ఎన్నికలపై మాత్రం క్లారిటీగా రాలేదు. ప్లస్ ఆర్ మైనస్ అంటూ కొత్త పదాన్ని తెచ్చి తానే ఎంత గందరగోళంలో ఉన్నాడో అందరికీ మీడియా ముఖంగా చూపించాడు.

లగడపాటి సర్వేలు ఎప్పుడు వాస్తవాని కి దగ్గర గా ఉంటాయి. అందుకే ఆయన సర్వేలకు విశ్వసనీయత ఎక్కువ.  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 156 సీట్లు వస్తాయని.. 33 ఎంపీ సీట్లు వస్తాయని అంకెలతో సహా చెప్పిన లగడపాటి సర్వే ఆ సమయంలో నిజమైంది.  ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో అందరూ వైసీపీ గెలుస్తుందంటే లగడపాటి మాత్రం టీడీపీ 30వేల మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. అన్నట్టే టీడీపీ 27వేల మెజార్టీతో గెలిచింది. 

కానీ నాలుగు రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమిదే అధికారం అని లగడపాటి జోస్యం చెప్పారు.  ఇక ఎన్నికల పూర్తయ్యాక సర్వే చెప్పడంలో మాత్రం తడబాటుకు గురయ్యారు. ఎప్పుడూ లేనిది ప్లస్ ఆర్ మైనస్ అంటూ కొత్త లెక్క చెప్పారు . చివరి రెండు రోజుల్లో తెలంగాణ లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని.. ఆ పరిణామాలతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిందని చెప్పారు. ఇందు కోసం 11కు ముందు మరోమారు ప్రెస్ మీట్ నిర్వహించి కరెక్ట్ లెక్క చెబుతానన్నారు.

దీన్ని బట్టి లగడపాటి కొందరి మేలు కోసం తన సర్వేలను - విశ్వసనీయతను తాకట్టు పెట్టాడని టీఆర్ ఎస్ ముఖ్యనాయకులు ఆరోపిస్తున్నారు. బాబు - కాంగ్రెస్ మెప్పు కోసం చేసిన ఈ సర్వే శుద్ధ తప్పని.. 11న ఇదే తేలుతుందని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. లగడపాటి సర్వే తప్పు అయితే ఇక ఆయన తలెత్తుకోలేరని.. ఆ సర్వేలను జనం ఎవరూ నమ్మరని అంటున్నారు. కూటమి విజయం సాధిస్తుందని అబద్ధం చెబుతూ లగడపాటి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఖచ్చితంగా చెప్పలేక.. కక్కలేక మింగలేక లగడపాటి అబద్ధాలాడుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.
Tags:    
  • Lagadapati Rajagopal 
  • Lagadapati Survey 
  • Telangana Elections 
  • telugu News 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS