• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రాఫిక్ రూల్స్ బ్రేక్...

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి లాలీపాప్ప్ ఎందుకిచ్చారు?

By - Tupaki Desk
Update: 2020-01-13 04:37 GMT
పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లేవారు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా డ్రైవ్ చేసేవారు.. హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు.. సీటు బెల్టును లైట్ తీసుకునే వాహనదారుల విషయంలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీసులు వినూత్న తరహాలో వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల్ని అధిగమించే వారి విషయంలో.. వాహనదారుల అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో వ్యవహరిస్తూ అక్కడి వారిలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారికి దిమ్మ తిరిగిపోయేలా భారీ జరిమానాలు విధించటం కామన్.

కానీ.. కొన్ని సందర్భాల్లో అలా చేయకుండా నిబంధనల్ని పాటించకపోతే ఎలాంటి ప్రమాదాలు  చోటు చేసుకుంటాయన్న అవగాహన కలిగించేలా చేయటమే కాదు.. గులాబీ పువ్వో.. సినిమా టికెట్టో.. చాక్లెటో ఇస్తూ అవగాహన కల్పిస్తుంటారు. దీనికి భిన్నంగా జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఉధంపూర్ లోని ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి వార్తల్లోకి వచ్చారు.

ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన వారికి ఫైన్లు విధించకుండా వారి చేతికో లాలీపాప్ ఇస్తూ.. ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలన్న ప్లకార్డును పెట్టి.. రోడ్డు మీద వెళుతున్న వాహన దారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందరి మాదిరి గులాబీ పువ్వో.. చాక్లెటో చేతికి ఇస్తే.. పెద్దగా ఫలితం ఉండదని.. కానీ లాలీ పాప్ ఇస్తే.. అది తినేంతసేపు ఆలోచించటమే కాదు.. వారి మనసు కూడా మారటం ఖాయమని చెబుతున్నారు. తాము తెర మీదకు తీసుకొచ్చిన లాలీపాప్ ప్లాన్ కు పాజిటివ్ రియాక్షన్ ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    
  • Why did Lollipop give those who broke traffic rules 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu Political Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

Copyright @2026

Powered by Blink CMS