• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  కొత్త బండికి మూడేళ్ల...

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

| కేంద్ర ప్రభుత్వం వాహనాల పీయూసీ సర్టిఫికెట్ నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఆరేళ్లలోపు ప్రైవేట్ బీఎస్-6 వాహనాలకు మూడేళ్ల పాటు సర్టిఫికెట్ గడువు ఉంటుంది. ఆరేళ్లు దాటిన వాహనాలకు ఏడాది, పదేళ్లు దాటిన వాటికి ఆరు నెలల చెల్లుబాటు ఉంటుంది. బీఎస్-4, పాత వాహనాలకు మాత్రం తరచూ పొల్యూషన్ పరీక్షలు తప్పనిసరి.

By - A.N.Kumar
Update: 2026-11-20 17:26 GMT

ప్రతి ఆరు నెలలకోసారి పొల్యూషన్ సెంటర్ల ముందు క్యూ కట్టి.. జేబుకు చిల్లు పెట్టుకుని.. ఆ కాగితం ముక్క కోసం పరుగులు పెట్టే వాహనదారుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. కాకపోతే ఆ దయ అందరి మీద కాకుండా కేవలం కొత్త కార్లు.. బైక్‌లు కొనే స్తోమత ఉన్నవారి మీద మాత్రమే కురిపించింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై కొన్ని బీఎస్-6 వాహనాలకు ఏకంగా మూడేళ్ల పాటు పీయూసీ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది. అంటే కొత్త బండి కొన్నవాళ్లు మూడేళ్ల పాటు ట్రాఫిక్ పోలీసుల కళ్లలో ధైర్యంగా కళ్లు పెట్టి చూడొచ్చన్నమాట.

కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ కొత్త రూల్స్ చూస్తుంటే ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడం కంటే పాత వాహనదారులను పరోక్షంగా కొత్త బండ్లు కొనేలా ప్రోత్సహిస్తున్నట్లు అనిపించక మానదు. ఆరేళ్లలోపు వయసున్న ప్రైవేటు బీఎస్-6 వాహనాలకు మూడేళ్ల వ్యాలిడిటీ ఇచ్చి ఆకాశానికి ఎత్తేసిన కేంద్రం.. అదే వాహనానికి ఆరు నుంచి పదేళ్లు నిండితే గడువును ఏడాదికి కుదించింది. ఇక పదేళ్లు దాటిందంటే చాలు... మళ్లీ పాత కథే.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పొల్యూషన్ పరీక్ష తప్పదు. కమర్షియల్ బీఎస్-6 వాహనాలకు ఆరేళ్లలోపు రెండేళ్లు.. పదేళ్లలోపు ఏడాది.. ఆ తర్వాత ఆరు నెలల వ్యాలిడిటీ పెట్టారు. ఇక బీఎస్-4 వాహనదారులకు ఆరు నెలలు.. బీఎస్-1, 2, 3 లాంటి పాత బండ్లు నడిపేవారికి మూడు నెలలకోసారి పరీక్ష పెట్టి.. ఆ బండ్లను రోడ్డుపైకి తీయాలంటేనే భయపడేలా గట్టిగానే ప్లాన్ చేశారు.

ఈ వార్త విని సంబరపడిపోయే వాహనదారులకు ప్రభుత్వం ఒక చిన్న షరతు కూడా పెట్టింది. కొత్త రూల్స్ వచ్చాయి కదా అని మీ జేబులో ఉన్న పాత సర్టిఫికెట్ గడువు దానంతట అదే మూడేళ్లకు పెరిగిపోదు. పాత కాగితంపై రాసి ఉన్న తేదీ ముగిసే వరకు ఆగాల్సిందే. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకుంటేనే ఈ కొత్త ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఇందులో ఒక తెలివైన వెసులుబాటు ఇచ్చారు. గడువు ముగియడానికి చివరి పది రోజుల్లోపు రెన్యూవల్ చేసుకుంటే పాత సర్టిఫికెట్ ముగిసిన తేదీ నుంచే కొత్త గడువు మొదలవుతుంది. ఒకవేళ బద్ధకించి గడువు దాటిన తర్వాత వెళ్తే మాత్రం పరీక్ష చేయించుకున్న రోజు నుంచే లెక్క మొదలవుతుంది.

దేశవ్యాప్తంగా అమలయ్యే ఈ నిబంధనలు తెలుగు నగరాల్లోని వాహనదారులకు కూడా వర్తిస్తాయి. కాకపోతే మూడేళ్ల వ్యాలిడిటీ వచ్చింది కదా అని పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డుపైకి వెళ్తే చలాన్ల మోత మోగడం ఖాయం. కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణలతో కొత్త బండి కొన్నవాడికి మూడేళ్ల పాటు హ్యాపీగా తిరిగే స్వేచ్ఛ దొరికితే పాత బండిని నమ్ముకున్న మధ్యతరగతి వాహనదారుడికి మాత్రం ప్రతి మూడు.. ఆరు నెలలకోసారి పొల్యూషన్ సెంటర్ల చుట్టూ తిరిగే ప్రదక్షిణలు తప్పేలా లేవు.

Tags:    
  • puccertificate 
  • pucrules 
  • bs6vehicles 
  • pollutioncertificate 
  • newvehiclerules 

Similar News

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

2026-11-07 02:33 GMT

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

Copyright @2026

Powered by Blink CMS