ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

కొద్ది నెలల క్రితం యూకేతో మన దేశానికి కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫలాలు భారతీయుయల దరికి చేరనున్నాయా? అంటే అవునని చెబుతున్నారు.;

Update: 2026-04-02 04:10 GMT

కొద్ది నెలల క్రితం యూకేతో మన దేశానికి కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫలాలు భారతీయుయల దరికి చేరనున్నాయా? అంటే అవునని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఖరీదైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తువు ఏదైనా.. పెరగటమే కానీ తగ్గే పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా ల్యాండ్ రోవర్ కార్ల ధరలు ఏకంగా రూ.40 నుంచి రూ.75 లక్షల మధ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు. సరాసరిన చూస్తే.. రూ.50 లక్షల వరకు తగ్గే వీలుందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ల్యాండ్ రోవర్ ధరల్లో భారీ మార్పునకు కారణం ఎఫ్ టీఏతో సుంకం 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గటం అత్యంత కీలక అంశంగా చెప్పాలి. ఇంత భారీ ఎత్తున సుంకం భారం తగ్గటంతో కార్ల ధరలు కారుచౌక అన్నట్లు మారనున్నట్లుగా చెబుతున్నారు. తగ్గిన సుంకం బెనిఫిట్ ను ఈ నెల 20 తర్వాత నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. సుంకం తగ్గింపునకు సంబంధించిన బెనిఫిట్ ను త్వరలోనే సంస్థ తమ డీలర్లకు సమాచారం అందిస్తుందని చెబుతున్నారు.

ఈ కార్ల రేంజ్ కు సంబంధించి మోడల్ కు తగ్గట్లు ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. మొత్తంగా సుంకం బెనిఫిట్ కారణంగా కనిష్ఠంగా 13 శాతం గరిష్ఠంగా 15 శాతం మేర ధరలు తగ్గుతాయని తెలుస్తోంది. మోడల్ కు అనుగుణంగా రూ.40 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు తగ్గే వీలుందని సమాచారం. ప్రస్తుతం టాప్ ఎండ్ రేంజ్ రోవర్ ఎస్ వీ 4.4 ధర రూ.4.25 కోట్లుగా ఉందని.. ఈ కారు ధర రూ.63 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు తగ్గే వీలుందని తెలుస్తోంది.

అదే సమయంలో రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఎస్ వీ ధర రూ.40 లక్షల మేర తగ్గే వీలుందని చెబుతన్నారు. రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్ వీలో కొత్త వేరియంట్ నూ కంపెనీ పరిచయం చేయనుంది. దీని ధర సుమారు రూ.2.05 కోట్లుగా చెబుతున్నారు. ఇక్కడే మరో కీలక విషయాన్ని చెబుతున్నారు. భారత్ లో పూర్తిగా తయారయ్యే మోడళ్లకు ధర తగ్గదని స్పష్టం చేస్తున్నారు. పూర్తిగా తయారై.. హై కెపాసిటి ఇంజిన్లు ఉన్న కార్లకు మాత్రమే ఈ బెనిఫిట్ వర్తిస్తుందని చెబుతున్నారు. దీనికి తోడు బ్రిటిష్ పౌండ్ తో పోలిస్తే.. రూపాయి విలువ గత ఏడాది వ్యవధిలో 13 శాతం క్షీణించింది. ఇది కూడా భారత్ కు దిగుమతి చేసుకునే ల్యాండ్ రోవర్ కార్ల ధరల తగ్గింపునకు సాయం చేస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News