స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ విభిన్న నటనతోనే కాదు. విలాసవంతమైన జీవనశైలితోనూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈ స్టార్ హీరో గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు చేరింది.

Update: 2026-10-13 09:53 GMT

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ విభిన్న నటనతోనే కాదు. విలాసవంతమైన జీవనశైలితోనూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈ స్టార్ హీరో గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు చేరింది. 2 కోట్ల కంటే ఎక్కువ విలువైన సరికొత్త బీఎండబ్ల్యూ ఐ7 లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ర‌ణ‌వీర్ సింగ్ కొనుగోలు చేశారు. ముంబై వీధుల్లో ఈ అత్యాధునిక కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ రణ్‌వీర్ సింగ్ కెమెరాకు చిక్కారు. ఆ వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ ధరించి ఎంతో ఉత్సాహంగా షోరూమ్ నుంచి కారును బయటకు తీస్తున్న ర‌ణ‌వీర్ హావభావాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

కార్లపై ఉన్న మక్కువతో ర‌ణ‌వీర్ ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను తన గ్యారేజీలో చేరుస్తున్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే ర‌ణ‌వీర్ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన జీఎంసీ హమ్మర్ ఈవీ ఉంది. తాజాగా బీఎండబ్ల్యూ ఐ7 సేకరణలో రెండో ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. పర్యావరణ హితమైన లగ్జరీ కార్ల వైపు ర‌ణ‌వీర్ చూపిస్తున్న ఆసక్తిది నిద‌ర్శ‌నం. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్ , రాయల్ కంఫర్ట్ ఉన్న ఎలక్ట్రిక్ సెడాన్ ధర వేరియంట్‌ను బట్టి 2 కోట్ల నుండి ప్రారంభమవుతుంది.

పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొణె దంపతులు ఇటీవల రెండోసారి తల్లి దండ్రు లయ్యారు. కొత్త అతిథి రాకతో కుటుంబంలో ఎంతో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ ఆనందకరమైన క్షణాల మధ్యలోనే రణ్‌వీర్ డ్రీమ్ కారును కొనుగోలు చేసి పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల రాక, సరికొత్త లగ్జరీ కార్ల కొనుగోలుతో ర‌ణ‌వీర్ వ్యక్తిగత జీవితం అత్యంత సంతోషకరంగా సాగుతోంది.

ప్రొఫెషనల్ ఫ్రంట్‌లోనూ రణ్‌వీర్ సింగ్ వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకుడు జై మెహతా తెరకె క్కిస్తున్న యాక్షన్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ `ప్రలయ్` చిత్రంలో నటిస్తున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు వరుస సినిమాలతో కెరీర్‌ను దూసుకుపోతూనే.. మరోవైపు ఇష్టమైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ రణ్‌వీర్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

కోట్ల విలువైన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఎంట్రీతో రణ్‌వీర్ సింగ్ ఆటోమొబైల్ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారారు. కార్ల సేకరణలో ఎప్పుడూ ముందుండే న‌యా హీరో? ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేయడం ద్వారా తన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్‌ను మరోసారి నిరూపించుకున్నారు.

Tags:    

Similar News