• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Business >  యాడ్స్ లేవు.. టీఆర్పీ...

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

| తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా న్యూస్ ఛానళ్లు కొనసాగుతున్నా, టీఆర్పీలు, వాణిజ్య ప్రకటనల కొరతతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. అయినా యజమానుల ఇతర వ్యాపారాలు, రాజకీయ నిధులు, ప్రభుత్వ ప్రకటనలు, యూట్యూబ్ ఆదాయం, పెయిడ్ ప్రోగ్రామ్స్, స్థానిక ప్రకటనలే ఛానళ్ల నిర్వహణకు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.

By - Satya P
Update: 2026-11-20 17:36 GMT

ఒక చానల్ కొనసాగాలంటే యాడ్స్ ప్రాణ వాయువు అన్నది తెలిసిందే. అలాగే టీఆర్పీ రేటింగ్ చాలా ప్రధానంగా ఉంటుంది. అయితే ఏపీలో చూస్తే 2026లో టీఆర్పీ రేటింగ్‌ల తాత్కాలిక నిలిపివేత జరిగింది. అలాగే ఒక్కసారిగా తగ్గిన వాణిజ్య ప్రకటనలతో అంతా ఉల్టా సీదా అయింది. ఈ పరిణామాలు చూస్తే కనుక తెలుగు నాట మెజారిటీ ఛానళ్లకు కనీస నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని అంటున్నారు. అయినా సరే తెలుగులో ఒక్క న్యూస్ ఛానల్ కూడా మూతపడకపోగా కొత్త ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అసలు ఇదేలా సాధ్యమన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.

పెద్ద ఎత్తున తెలుగు నాటే :

దేశంలో ఏ ప్రాంతీయ భాషలోనూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా 24 బై 7 శాటిలైట్ న్యూస్ ఛానళ్లు నడుస్తున్నాయి. నిజానికి ఒక చానల్ నడవాలి అంటే శాటిలైట్ ఛార్జీలు, కేబుల్ క్యారేజ్ ఫీజులు, రిపోర్టర్లు, స్టూడియో సిబ్బంది జీతాలు ఇలా అన్నీ కలిపి నెలకు కనీసంగా 1.2 కోట్ల రూపాయల నుండి 5 కోట్ల రూపాయల దాకా వరకు ఖర్చవుతుందని లెక్క ఉంది. ఇక మరో వైపు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియాకు డిజిటల్ మీడియా విస్తృతి పెరగడంతో భారీ పోటీ ఒత్తిడి ఉంది. ఇలా అన్ని వైపులా ప్రతికూలతలు ఉన్నా తెలుగులో ఒక్క న్యూస్ ఛానల్ కూడా మూతపడకపోగా కొత్త ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరి ఇదంతా ఎలా సాధ్యం అంటే ఒక్కటే జవాబు.ఈ రోజు న్యూస్ ఛానల్ అనేది లాభాల కోసం నడిపే వ్యాపారం కానే కాదని అంటున్నారు. అది ఒక అధికార సాధనంగానూ వ్యాపార రక్షణ కవచంగానూ ఉంటోంది అన్నది ఒక విశ్లేషణ.

చానళ్ళను బతికించేవి :

వాణిజ్య ప్రకటనలు టీఆర్పీలు లేకపోతేనేమి తెలుగు న్యూస్ ఛానళ్లు బతకడానికి ప్రధానంగా తెర వెనుక ఆరు మార్గాలు ఉన్నాయని అంటున్నారు. అందులో మొదటిది చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన న్యూస్ ఛానళ్ల యజమానులకు రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లిక్కర్, మైనింగ్, చిట్ ఫండ్స్, ఫార్మా విద్యాసంస్థల వంటి వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అందువల్లనే ఛానల్ నడపడం వల్ల ఏడాదికి 15 నుంచి 20 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా వారికి ఫికర్ లేదని అంటున్నారు. అంతే కాదు తమ చేతిలో ఒక 24బై7 న్యూస్ ఛానల్ ఉంటే ప్రభుత్వాలు, అధికారులు ప్రత్యర్థుల నుండి తమ ఇతర వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా కాపాడుకోవచ్చన్నది కూదా వీరి ప్రధాన వ్యూహంగా ఉంది అంటున్నారు. ఇక చానళ్ళలో వచ్చే నష్టాన్ని తమ ఇతర వ్యాపారాల మార్కెటింగ్ కి రక్షణ ఖర్చుగా భావిస్తారు అని కూడా అంటున్నారు

మీడియాకు రాజకీయ పార్టీలకు మధ్యన :

తెలుగు మీడియా విషయంలో వారికీ రాజకీయ పార్టీలకు విడదీయరాని బంధం ఉందన్నది బహిరంగ రహస్యంగా చెబుతారు. దాదాపుగా ప్రతి ఛానల్ ఏదో ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అనుకూలంగా ముద్ర వేసుకుందన్నది సాధారణ జనాలకు ఇట్టే బోధపడిన విషయమే. దాంతో కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి ప్రత్యర్థులపై కౌంటర్ ఎటాక్ చేయడానికి రాజకీయ పార్టీలు లేదా వారికి అండగా ఉండే బడా నేతలు తెరవెనుక నుండి ఛానళ్లకు భారీగా నిధులు సమకూరుస్తారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాటగా చెబుతారు.

ప్రభుత్వ ప్రకటనల మద్దతు :

ఇక అత్యధిక శాతం మీడియా అధికార పార్టీలతోనే అనుసంధానం అవుతోంది కాబట్టి వాణిజ్య ప్రకటనలు రాకపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ప్రకటనలు అధికంగా ఉంటున్నాయి. దాంతోనే న్యూస్ ఛానళ్లకు ఇవి ఆక్సిజన్‌లా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. దీని వల్లనే 2026 లో టీఆర్పీ రేటింగ్‌లు నిలిచిపోయిన సమయంలోనూ ప్రభుత్వ యాడ్స్ వల్లే న్యూస్ ఛానళ్లు భారీ ఆర్థిక పతనం నుండి బయటపడ్డాయని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మెజారిటీ మీడియా సంస్థలకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాల ప్రచారం పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ దక్కించుకుంటారన్నది కూడా ఉంది.

డిజిటల్ అండ్ యూట్యూబ్ ఆదాయం :

ఇంకో వైపు చూతే పెద్ద ఎత్తున శాటిలైట్ టీవీ ఛానల్ నష్టాల్లో నడుస్తున్నా అదే ఛానల్ బ్రాండ్ పేరుతో నడిచే యూట్యూబ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్లు అయితే వేరే విధంగా లాభాలను తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు. తమ టీవీలలో ప్రసారమయ్యే చిన్న చిన్న క్లిప్పింగ్‌లను సంచలన థంబ్‌నెయిల్స్‌తో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా కోట్లలో వ్యూస్ సంపాదిస్తున్నారు. అలాగే గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రామాటిక్ యాడ్స్ ద్వారా నెలకు లక్షల రూపాయల ఆదాయం సైతం వస్తోందని అంటున్నారు. ఈ విధంగా టీవీ కంటే డిజిటల్ విభాగమే ఇప్పుడు ఛానళ్లకు కీలక ఆదాయ వనరుగా మారిందన్నది అసలైన వాస్తవంగా ఉంది.

పెయిడ్ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు :

మరో వైపు చూస్తే టీఆర్పీలతో సంబంధం లేకుండా నేరుగా డబ్బులు వసూలు చేసే మార్గాలను ఛానళ్లు ఎంచుకున్నాయని అంటున్నారు. వాటిలో ముఖ్య పాత్ర పోషించేది పెయిడ్ ఇంటర్వ్యూలుగా చెబుతున్నారు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్టర్లు, విద్యాసంస్థల అధిపతుల ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రమోషనల్ కథనాల కోసం ప్యాకేజీల రూపంలో డబ్బులు వసూలు చేస్తారని కూడా చెబుతున్నారు. ఇక కార్పొరేట్ ఈవెంట్లు అవార్డులు పీఅరుతో బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డులు, హెల్త్ సమ్మిట్, ప్రాపర్టీ షో వంటి ఈవెంట్లు నిర్వహించి కూడా వాటికి స్పాన్సర్‌షిప్‌ల రూపంలో కోట్ల రూపాయలు ఆదాయం రాబట్టుకుంటారని అంటున్నారు.

క్యాష్-స్ట్రాప్డ్ బార్టర్ డీల్స్ & లోకల్ నెట్‌వర్క్ :

అదే విధంగా చూస్తే పెద్ద బ్రాండ్ల యాడ్స్ రాని చిన్న ఛానళ్లు జిల్లా నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు టార్గెట్లు పెడుతున్నాయి. అలా స్థానిక వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఆసుపత్రులు, పండుగ శుభాకాంక్షల స్క్రోలింగ్ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆయా జిల్లాల సిబ్బంది జీతాలు స్థానిక ఖర్చులను సర్దుబాటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఇలా చూస్తే కనుక ఒక వైపు తమ సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి మరోవైపు రాజకీయ పలుకుబడిని నిలబెట్టుకోవడానికి యజమానులు పెట్టే పెట్టుబడులకు అదననగా ప్రభుత్వ యాడ్స్ డిజిటల్ వ్యూస్ పుణ్యమా అని నష్టాల్లో ఉన్నా సరే 24 గంటలూ బ్రేకింగ్ న్యూస్‌లతో హడావిడి చేస్తూనే ఉన్నాయని అంటున్నారు. వీటిని చూస్తూంటే ఒక చానల్ పెట్టేస్తే పోలా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అదంతా వీజీ కాదు, దానికి రంగు రుచి వాసన అన్నీ ఉండాలి. అదే రాజకీయ సామాజిక ప్రాంతీయ సమీకరణలు అని తెలుగులో అనువదిస్తున్నారు. అదన్న మాట మ్యాటర్.

Tags:    
  • telugunewschannels 
  • telugumedia 
  • trpratings 
  • advertisingrevenue 
  • mediabusiness 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

ధన త్రయోదశి మరీ.. మనోళ్ల బంగారం కొనుగోళ్లు ఏం రేంజ్ లో ఉన్నాయంటే?

2026-11-07 06:50 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ

2026-11-01 15:05 GMT

సినిమాలకు దూరంగా ఉన్నా.. భారీగా సంపాదిస్తున్న సమంత!

2026-10-22 12:30 GMT

వామ్మో ఇదేం తాగుడు? రోజులో రూ.303 కోట్ల లిక్కర్ సేల్

2026-10-22 08:00 GMT

3300 కోట్ల సంప‌ద సృష్టి వెన‌క సీక్రెట్.. ఈ న‌టుడు ఒక బ్యాడ్ బిజినెస్‌మేన్!

2026-10-16 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS