• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Business >  థియేట‌ర్ల వ్యాపారంలో...

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

| బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ థియేటర్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. తన పిల్లలు నైసా, యుగ్ పేర్లతో ప్రారంభించిన NY Cinemas ద్వారా ఇప్పటికే 25కి పైగా మల్టీప్లెక్స్‌లలో 80కి పైగా స్క్రీన్లను నిర్వహిస్తున్నారు. రాబోయే 2-3 ఏళ్లలో 250 స్క్రీన్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా తెలంగాణ, ఏపీ సీఎంలను కలసి హైదరాబాద్, వరంగల్, అమరావతి, విశాఖపట్నం సహా పలు నగరాల్లో మల్టీప్లెక్స్‌ల ఏర్పాటుపై చర్చించినట్లు కథనాలు వస్తున్నాయి.

By - Sivaji Kontham
Update: 2026-11-07 04:02 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర‌ నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన అజయ్ దేవగన్, ఇప్పుడు థియేటర్ ఎగ్జిబిషన్ రంగంలో కూడా సరికొత్త విప్లవాన్ని తీసుకువస్తున్నారు. తన బిడ్డలు నైసా (Nysa), యుగ్ (Yug) పేర్ల మొదటి అక్షరాల కలయికతో NY Cinemas (గతంలో Devgn CineX) అనే మల్టీప్లెక్స్ చైన్‌ను ఆయన స్థాపించారు. కేవలం నటుడిగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా సినిమా ప్రదర్శన వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా దేవ‌గ‌న్ ఈ రంగంలో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెడుతున్నారు. ప్రేక్షకులకు ప్రపంచస్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించాలనే ధ్యేయంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల‌లో స్క్రీన్ల‌ను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం `ఎన్.వై. సినిమాస్` నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లోని దాదాపు 25కి పైగా మల్టీప్లెక్స్ థియేటర్లలో 80కి పైగా ఆపరేషనల్ స్క్రీన్ల‌తో పాటు.. కొన్నిటిని నిర్మాణ ద‌శ‌కు ఈ సంస్థ‌ చేర్చింది. రానున్న‌ 2 నుండి 3 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా మొత్తం 250 స్క్రీన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టైర్-1 మెట్రో నగరాలతో పాటు ప్రధానంగా సినీ వినోదం తక్కువగా అందుబాటులో ఉన్న టైర్-2, టైర్-3 నగరాల పరిధిలో మల్టీప్లెక్స్ రంగాన్ని విస్తరించడం ద్వారా ప్రేక్షక వర్గాన్ని మరింత పెంచవచ్చని అజయ్ దేవగన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

మెట్రోలు- ప్రధాన పట్టణాలలో ఎన్.వై. సినిమాస్ ఇప్పటికే తమ ఉనికిని చాటుకుంది. ముంబైలోని చారిత్రాత్మక సిటీలైట్ థియేటర్ స్థానంలో 3 స్క్రీన్‌లు, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో లగ్జరీ మల్టీప్లెక్స్‌ను నిర్మించడంతో పాటు.. గురుగ్రామ్‌లో 4-స్క్రీన్ల అల్ట్రా-లగ్జరీ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 6 స్క్రీన్‌ల భారీ మల్టీప్లెక్స్‌తో పాటు అహ్మదాబాద్, ఆనంద్, సురేంద్రనగర్, పంజాబ్‌లోని భటిండా, రాజస్థాన్‌లోని రతన్‌ఘర్, .. యూపీలోని కాన్పూర్ వంటి నగరాల్లో తమ థియేట‌ర్ల చైన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ థియేటర్లలో నాణ్యమైన సౌండ్, లగ్జరీ సీటింగ్, సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ భారీ విస్తరణ ప్రాజెక్ట్ కోసం అజయ్ దేవగన్ సుమారు 500 కోట్ల నుండి 600 కోట్ల వరకు పెట్టుబడులను కేటాయించినట్లు వ్యాపార వర్గాల రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సంస్థకు అజయ్ దేవగన్ ఫౌండర్ కం ప్రమోటర్‌గా వ్యవహరిస్తుండగా.. రాజీవ్ శర్మ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా మల్టీప్లెక్స్‌లను నిర్మించే క్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ యజమానులతో లాంగ్-టర్మ్ లీజింగ్ లేదా రెవెన్యూ షేరింగ్ మోడల్ ఆధారంగా భాగస్వామ్యాలు కుదుర్చుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఉత్తరాదిన సక్సెస్ సాధించిన అనంతరం, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తమ NY సినిమాస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించాలని అజయ్ దేవగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్లు, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలతో పాటు.. ఏపీ రాజధాని అమరావతిలో ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లు... విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలలో అధునాతన మల్టీప్లెక్స్‌లు నిర్మించడానికి ప్రభుత్వ అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనపై వారు చర్చలు జరిపిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాలు స‌హా పొరుగు రాష్ట్రాల్లోను మ‌ల్టీప్లెక్స్ వ్యాపారాలు చేస్తున్న హీరోగా మ‌హేష్ బాబుకి గుర్తింపు ఉంది. ప‌లువురు తెలుగు అగ్ర హీరోల థియేట‌ర్ల రంగంలో భారీ పెట్టుబ‌డులు పెడుతుండ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ స్టార్లు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిష‌న్ రంగంలో పోటీకి దిగ‌డం ఉత్కంఠ‌ను మ‌రింత పెంచుతోంది.

Tags:    
  • ajaydevgn 
  • nycinemas 
  • maheshbabu 
  • tollywood 
  • multiplexbusiness 

Similar News

ధన త్రయోదశి మరీ.. మనోళ్ల బంగారం కొనుగోళ్లు ఏం రేంజ్ లో ఉన్నాయంటే?

2026-11-07 06:50 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ

2026-11-01 15:05 GMT

సినిమాలకు దూరంగా ఉన్నా.. భారీగా సంపాదిస్తున్న సమంత!

2026-10-22 12:30 GMT

వామ్మో ఇదేం తాగుడు? రోజులో రూ.303 కోట్ల లిక్కర్ సేల్

2026-10-22 08:00 GMT

3300 కోట్ల సంప‌ద సృష్టి వెన‌క సీక్రెట్.. ఈ న‌టుడు ఒక బ్యాడ్ బిజినెస్‌మేన్!

2026-10-16 09:30 GMT

UKలో బిజినెస్: క‌త్రిన కంటే ముందే స‌క్సెసైన టాప్-3 హీరోయిన్‌లు!

2026-10-13 03:38 GMT

ఇండియా బెస్ట్ స్టార్లు సినిమాల‌తో ప‌ని లేకుండా సంపాదనాప‌రులు!

2026-10-08 03:48 GMT

ప్రకటనలు కాదు.. ప్రజల పార్టిసిపేషన్‌తో పబ్లిసిటీ.. కంపెనీ మాస్టర్ ప్లాన్!

2026-10-07 06:16 GMT

$110 బిలియన్ల భారీ డీల్: స్కైడాన్స్ గా మారిన‌ పారామౌంట్ - వార్నర్ బ్రోస్ ఉమ్మడి సంస్థ!

2026-10-03 10:29 GMT

Copyright @2026

Powered by Blink CMS