కరోనాపై ఖర్చు.. 100 బిలియన్ డాలర్లు

Update: 2020-08-14 17:30 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. 100 బిలియన్ డాలర్లు.. అక్షరాల కరోనా కోసం ఖర్చు చేయాల్సిందేనని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో). కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని.. ఈ వైరస్ తో పోరాటానికి ఇంకా వ్యాక్సిన్ తయారు చేయాల్సి ఉందని తెలిపింది.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ.. కరోనా పై ప్రపంచవ్యాప్తంగా భారీగా ఖర్చు అవుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 20.69 మిలియన్ల మంది ఈ వైరస్ బారినపడ్డారని పేర్కొన్నారు. ఏడున్నర లక్షలమంది మరణించారని వివరించారు.

వ్యాక్సిన్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోటీ డిమాండ్ ఏర్పడిందని.. ఈ క్రమంలోనే ధరలు పెరిగి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కరోనాకు మందులు, నివారణ మాత్రలకు భారీగా డిమాండ్, ధరలు ఉన్నాయని.. వ్యాక్సిన్ కు అంతకుమించిన ధర పలికే అవకాశం ఉందని టెడ్రోస్ అథనామ్ అభిప్రాయపడ్డారు. ప్రజలు, ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
Tags:    

Similar News