• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత్ టూర్ లో ట్రంప్...

భారత్ టూర్ లో ట్రంప్ ల్యాండ్ అయ్యేది ఎక్కడ?

By - Tupaki Desk
Update: 2020-02-19 12:30 GMT
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి భారత్ కు వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. మరో నాలుగు రోజుల్లో రానున్న ఆయన కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్రంప్ ప్రయాణించే మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న విషయం తెలిసిందే. పేదలు నివాసం ఉండే ప్రాంతాలు కనిపించకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ బయటకు రాలేదు. కాకుంటే ఆయన ఆహ్మాదాబాద్ లో కొత్తగా నిర్మించిన స్టేడియం లో మాత్రం సభను నిర్వహిస్తున్న విషయంపై తెలిసిందే.

తాజాగా ట్రంప్ ఎక్కడ ల్యాండ్ అవుతారన్న దానిపై కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకూ దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ల్యాండ్ అవుతారన్నప్రచారం సాగింది. అందుకు భిన్నంగా ఇప్పుడు జైపూర్ లో ల్యాండ్ కావటానికి వీలుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎందుకిలా? అంటే.. వాతావరణం సరిగా లేకుంటే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఇందుకు తగ్గట్లే ఏర్పాట్లు ప్రారంభించారు. తాజాగా జైపూర్ విమానాశ్రయాన్ని అమెరికన్ అధికారులు సందర్శించారు. నలుగురితో కూడిన భద్రతా అధికారుల బృందం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదే అంశాన్ని జైపూర్ విమానాశ్రయాధికారి జైదీప్ సింగ్ మాట్లాడుతూ.. వీవీఐపీలు దిగటానికి వీవీఐపీ విమానాల్ని హ్యాండి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 24.. 25 తేదీల్లో జైపూర్ విమానాశ్రయ ప్రాంతాల్లో హైఅలెర్ట్ ను ప్రకటించారు.
Tags:    
  • Donald Trump may make maiden visit to India in February 
  • Trump Coming To India 
  • Trump In India 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS