• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలుగు రాష్ట్రాల్లో థర్డ్...

తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ తీవ్రతరం ఎప్పుడంటే?

By - Tupaki Desk
Update: 2022-01-29 10:50 GMT
దక్షిణాఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం గా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది జూన్ తర్వాత తగ్గిన ఉద్ధృతి... మళ్లీ డిసెంబర్ రెండో వారం నుంచి అధికమైంది. ఆ తర్వాత కొత్త సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాల వల్ల వివిధ దేశాల్లో వైరస్ విధ్వంసం చేస్తోంది. మనదేశంలోనూ బాధితుల సంఖ్య లక్షలకు చేరింది. కాగా కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కాస్త తక్కువే ఉంది. కాగా ఈ రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరే సమయం రాబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత కొంత కాలంగా దేశంలో మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రాల సరస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయని ప్రొఫెసర్ ఎం. విద్యాసాగర్ అన్నారు. రానున్న రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 15 నాటికి థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కి చేరుతుందని అంచనా వేశారు. మరో వారం, పది రోజుల్లో పాజిటివ్ కేసులు మరింత పెరిగే అకాశం ఉందని ఆయన వివరించారు.

ఒమిక్రాన్ ప్రభావం తక్కువే ఉన్నా కూడా అతి త్వరగా వ్యాప్తి చెందుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కొత్త వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఎక్కువమందిలో లక్షణాలు బయటకు కనిపించడం లేదని... ఫలితంగా అతి త్వరగా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని అంచనా వేశారు. డెల్టాతో పోల్చితే దీని తీవ్రత చాలా తక్కువగా ఉందని అన్నారు. అయితే పాజిటివ్ కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతాయని వెల్లడించారు. ఇకపోతే చిన్నారులపై ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపబోదని పేర్కొన్నారు. ఒకవేళ సోకినా.. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో అతి త్వరగా కోలుకుంటారని వెల్లడించారు. అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

దేశంలో మూడో దశ వేగంవంతం అవుతోందని సూత్ర కన్సార్టియం పరిశోధకులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. డెల్టా వేరియంట్ ప్రభావంతో పోల్చితే ఇది చాలా స్పల్పమని అన్నారు. ఆస్పత్రుల్లో చేరే బాధితుల సంఖ్య చాలా తక్కువంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ప్రజలు వైరస్ పట్ల ఆందోళన చెందకుండా... కనీస జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు తగ్గాయి.  2,35,532 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలు పెరగడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. మహమ్మారి ధాటికి మరో 871 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పాజిటివిటీ రేటు 13.39శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Tags:    
  • Telugustates 
  • newvarient 
  • carona 
  • andhrapradesh 
  • telangana 
  • newcases 
  • vaccines 
  • caronanews 
  • tupakiupdates 

Similar News

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS