తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇప్పుడు ఏ దశలో ఉంది?
మొన్నటివరకు కరోనాను జయించామని అనుకున్నదంతా అబద్ధమని తేలింది. వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి.. కరోనా కోరలు పీకేసినట్లేనని ఆనందంగా ఫీలైన వారంతా ఇప్పుడు టెన్షన్ తో కిందా మీదా పడుతున్నారు. వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నప్పటికీ.. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన నెలలో దేశ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల సంఖ్య పదిహేను వేలు కాగా.. ప్రస్తుతం 60వేలను దాటేసింది.
గత నెలలో దేశంలోని నాలుగైదు రాష్ట్రాల్లోనే కేసుల నమోదు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది కాస్తా.. రెట్టింపు రాష్ట్రాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. మిగిలిన దేశాలకు భిన్నంగా ప్రస్తుతం దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దశ నడుస్తున్నట్లు చెబుతున్నారు. కేరళలో కరోనా మూడో దశలో నడుస్తుంటే.. మహారాష్ట్రంలో రెండో దశ విస్తరిస్తోంది.
మరి.. రెండు తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే.. ఏపీ రెండో దశలోకి అడుగు పెట్టి.. కాస్త ముందుకు వెళితే.. తెలంగాణలో మాత్రం రెండో దశలోకి ఇప్పుడే మొదలైనట్లు చెబుతున్నారు. ఈ దశ రెండు నుంచి మూడు నెలల వరకు సాగవచ్చని చెప్పాలి. అంటే.. దగ్గర దగ్గర జూన్ నెలాఖరు వరకు ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెప్పాలి. మరి దీనికి పరిష్కారం లేదా? అంటే.. మన చేతుల్లోనే ఉంది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవటం.. టీకాలు వేసుకోవటం లాంటి వాటిని పాటిస్తే.. కోవిడ్ ను సులువుగా ఎదుర్కొనే వీలుంది.
టీకాలు వేయించుకున్న తర్వాత కూడా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కదా? అన్న సందేహం అక్కర్లేదంటున్నారు. ఎందుకంటే.. టీకా వేసుకున్న తర్వాత.. కేసులు నమోదు అవుతున్నది తక్కువ మందిలోనే. టీకా వేసుకున్న పది మందిలో ఒకరికి మాత్రమే వచ్చే వీలుంది. టీకా సమర్థత 80 - 90 శాతం మాత్రమే అన్నది మర్చిపోకూడదు. అయితే.. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో పాజిటివ్ లక్షణాలు వస్తే..రోగ తీవ్రత తక్కువగా ఉంటుందన్నది సానుకూలాంశంగా చెప్పాలి.