• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దొంగలు బాబోయ్ దొంగలు :...

దొంగలు బాబోయ్ దొంగలు : ఉక్కు లాంటి టౌన్ షిప్ లో కత్తులు...తుపాకులూ...?

By - Tupaki Desk
Update: 2022-05-26 02:30 GMT
ఉక్కు కర్మాగారం విశాఖకు గర్వకారణం. అలాంటి ఉక్కు కర్మాగారంలో పనిచేసే అధికారులు ఉద్యోగుల కోసం మూడు వేల ఎకరాలలో సువిశాలంగా నిర్మించిన టౌన్ షిప్ అది. అటు అధునికత, ఇటు పచ్చతనం పరిమళించే ప్రశాంతత సంతరించుకుని కొలువుంటే టౌన్ షిప్ ఇపుడు దొంగలు బాబోయ్ దొంగలు అంటోంది.

అక్కడ అంతా అధికారులు, ఉద్యోగులు ఉంటారు. వారి కోసం ఏకంగా 9450 క్వార్టర్లు వివిధ కేటగిరీలలో నిర్మించారు. అంతా ఒక్కటిగా హాయిగా ఉంటూ అందమైన ఆ టౌన్ షిప్ లో ధీగా గడుపుతున్నారు. అక్కడ వివిధ సెక్టార్ల మధ్యన జీవించే ఉద్యోగులు అంతా అన్నదమ్ములుగా ఉంటారు. పగలైనా రేయి అయినా ఇప్పటిదాకా ఎలా భయమూ బెంగా లేదు.

కానీ ఈ మధ్య అక్కడ కూడా కలికాలం ప్రవేశించింది. ఆకలికాలంలో అర గజానికో దొంగ అన్నట్లుగా సీన్ తయారైంది. అలాంటి దొంగలకు ఆటపట్టుగా స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ ఇపుడు ఉంది  అంటున్నారు. ఇక్కడ దొంగలు చిత్రమైన వారు. వారు ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీ పట్టుకుని బెదిరించి సొత్తు దోచుకుంటున్నారు.

ఇలా ఈ మధ్యనే వరసబెట్టి దొంగతనాలు పెద్ద ఎత్తున జరగడంటో టౌన్ షిప్ మొత్తం కలవరంతో కంగారుపడిపోతోంది. లేటెస్ట్ గా ఒక మహిళ సాయంత్రం ఆలయానికి వెళ్ళి తన క్వార్టర్స్ కి వెళ్తూండంగా అనుసరించి ఆమెను బెదిరించాడొక దొంగ. ఆమె మెడ మీద కత్తి పెట్టి మొత్తం బంగారం ఆభరణాలను దోచుకున్నాడు. ఆమె గట్టిగా కేకలు పెట్టేసరికి  అక్కడే వాకింగ్ చేస్తున్న స్టీల్ ప్లాంట్ అధికారి మనోహర్ ఆ దొంగను పట్టుకున్నాడు.

అంతే ఆ దొంగ మనోహరి మీద కత్తితో దాడి చేశాడు. అయితే ఆ గడబిడ చూసి స్థానికంగా ఉన్న వారు అంతా అక్కడికి చేరడంతో దొంగ దొరికాడు. సొత్తూ దొరికింది. ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక్కడ చిత్రమేంటి అంటే ఈ ఉక్కు దొంగ వద్ద ఉన్న కత్తి ఒరిజినల్, తుపాకీ మాత్రం డమ్మీ.

ఇలాంటి దొంగలు కొందరు టౌన్ షిప్ లో చేరి సెక్టార్ కి ఒకరు వంతున పంచుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం వారి నేరాలకు ఇపుడు అనువుగా మారింది అంటున్నారు. దాంతోనే వరసబెట్టి దొంగతనాలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ టౌన్ షిప్ కి పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ కాపలా ఉంటారు. అదే విధంగా పోలీసులు కూడా నిఘా పెడతారు. మరి ఇంతమంది ఉన్నా దొంగలు ఎలా వస్తున్నారు అంటే జవాబు సింపుల్. మన నిఘా వ్యవస్థ వెరీ పూర్ అని. అందుకే మే నెల 23న సాయంత్రం మహిళ మీద దొంగ దాడి చేశాడు. అంతకు ముందు కూడా సెక్టార్ 5లో కూడా ఇదే తీరున దొంగతనాలు జరిగాయి.

మొత్తానికి ఉక్కు లాంటి టౌన్ షిప్ కూడా మాకు లెక్క లేదు అని చిల్లర దొంగలు, ముసుగు దొంగలు రెచ్చిపోతూంటే విశాఖపట్నమే షాక్ అవుతోంది. రోజురోజుకీ నేరగాళ్ళు పెరిగి పెచ్చరిల్లుతూంటే పోలీసుల వైఫల్యం, నిఘాలో కొట్టొచ్చినట్లుగా కనబడుతున్న నీరసత్వం కూడా జనాలకు శాపాలు అవుతున్నాయి. దొంగలకు అవే అవకాశాలుగా మారుతున్నాయి. ఏది ఏమైనా దొంగలు బాబోయ్ దొంగలు అని విశాఖ అంతా ఇపుడు షేక్ అవుతున్న సీనే కనిపిస్తోంది మరి.
Tags:    
  • Vizag Steel Plant 
  • Privatization 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS