బైకుపై విశాఖ జంట అసభ్య విన్యాసాలు.. వైరలవుతున్న వీడియో!

Update: 2022-12-30 09:17 GMT
కొంతమంది యువతీయువకులు బహిరంగంగానే అన్ని హద్దులు దాటుతున్నారు. రోడ్లపైన ప్రజలు ఉన్నారనే ఆలోచన కానీ, పబ్లిక్‌ గా ఇలా చేయడం సరికాదనే చింత కానీ వారికి ఉండటం లేదు. పార్కులు, సినిమా థియేటర్లు మాత్రమే కాకుండా నడిరోడ్లపైన పబ్లిక్‌ గానే అసభ్య పద్దతుల్లో కనిపిస్తున్నారు.

తాజాగా విశాఖపట్నంలో ఒక జంట వీడియో వైరల్‌ అవుతుంది. దాదాపు వాళ్లిద్దరూ ప్రేమికులే కావచ్చని చెబుతున్నారు. ప్రేమికులు బైక్‌పై వెళుతూ, అసభ్యకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అలాగే ఇది పోలీసు అధికారుల దృష్టిలో కూడా పడింది. దీంతో ఇది వైరల్‌ అయ్యింది.

ఈ ఘటన వైజాగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే, అజయ్‌ (22) అనే యువకుడు బైక్‌ నడుపుతుండగా, 19 ఏళ్ల యువతి అతని ముందు రివర్స్‌ పొజిషన్‌లో అతడికి ఎదురుగా కూర్చుని ఉంది. అతడికి ఎదురుగా ఇంజన్‌పైన కూర్చుని.. తన రెండు కాళ్లను అతడి నడుము చుట్టూ పెనవేసుకు కూర్చుంది. తన ప్రేయసి తనకు ఎదురుగా హత్తుకుని కూర్చుని ఉండటంతో అతడు బైకు తోలుతూ ప్రమాదకర విన్యాసాలు చేశాడు.

అందులోనూ వారిద్దరూ కాలేజీ డ్రస్సులోనే ఉన్నారు. దీంతో వారిద్దరూ ఇంజనీరింగ్‌ విద్యార్థులని తెలుస్తోంది. వీరిద్దరూ బైకుపై అసభ్యంగా వెళ్తుండగా వారి వెనుక కారులో వచ్చిన వారు ఈ వీడియో తీశారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయిన వెంటనే అది వైరల్‌గా మారింది. ఆ జంట చేసిన పని ఓవైపు అసభ్యతతో ఉంది. మరోవైపు అదే భంగిమలో ప్రమాదకరంగా బైకుపై ప్రయాణిస్తున్నారు.  
Read more!

నడిరోడ్డుపై ఓ మహిళతో బైక్‌పై అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన అజయ్‌తోపాటు ఆ యువతిని సైతం అరెస్ట్‌ చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోవైపు చీప్‌ థ్రిల్స్‌తో తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News