అమెరికాతో యుద్ధం : ఇరాన్ కి టన్నుల కొద్దీ ధైర్యం !
ఎక్కడ అమెరికా ఎక్కడ ఇరాన్. ఆయుధాల పరంగా ఆర్థిక పరంగా ఇతరరత్రా ఎలా చూసుకున్నా పసి కూన లాంటిది. కానీ ఎక్కడా తగ్గేదే లేదు అని చెబుతోంది.;
ఎక్కడ అమెరికా ఎక్కడ ఇరాన్. ఆయుధాల పరంగా ఆర్థిక పరంగా ఇతరరత్రా ఎలా చూసుకున్నా పసి కూన లాంటిది. కానీ ఎక్కడా తగ్గేదే లేదు అని చెబుతోంది. ఇప్పటికి దాదాపు పది రోజులు అవుతున్నా అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ కలసి ఇరాన్ మీద భీకరమైన పోరు సాగిస్తున్నా ఇరాన్ మాత్రం ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా రెడీ అంటోంది. గుండె నిండా టన్నుల కొద్దీ ధైర్యం ఉంది అంటోంది. ఒక దేశంగా చూస్తే ఇరాన్ ఇంతలా అగ్ర రాజ్యం మీద పోరాటం చేయడం గ్రేట్ అనే అంటారు. కానీ దాని వెనక బలమైన ధీమా ఏంటి అన్నదే చర్చగా ఉంది.
చమటలు పట్టిస్తున్నా :
ఇజ్రాయెల్ తో ఎవరు యుద్ధం చేసినా చుక్కలు చూపిస్తుంది అని అంటారు. ఎందుకంటే రక్షణపరంగా ఇజ్రాయెల్ అలాంటిది మరి. ఆయుధ సంపత్తితో పాటు అత్యాధునిక టెక్నాలజీని మిక్స్ చేసి మరీ యుద్ధాన్ని నడుపుస్తుంది. అలాంటి ఇజ్రాయెల్ కి అమెరికా తోడు అయింది. దాంతో ఈ రెండు దేశాల ముందు నిలిచి గెలవడం ఇరాన్ వశం అయ్యేనా అని అంతా చర్చించుకునే పరిస్థితి ఉంది. యుద్ధం మొదలైన కొద్ది గంటలలోనే ఇరాన్ అధినేత సుప్రీ లీడర్ ఖమేనీని లేకుండా చేశారు. దాంతో తల తెగిన మొండెం మాదిరిగా ఇరాన్ తయారవుతుందని కకావికలు అవుతుందని భావించారు. కానీ పది రోజుల పాటు అలుపెరగని యుద్ధానికి ఇరాన్ సిద్ధం కావడం అంటే ప్రపంచమే నివ్వెర పోతోంది ఇక అమెరికా పెద్దన్నకు అయితే అసహనం తన్నుకుని వస్తోంది. మేమే గెలిచామని పైకి ఎంతలా బీరాలు పలుకుతున్నా ఇరాన్ తో కొలిక్కిరాని ఈ యుద్ధాన్ని చూసి అమెరికాకు కూడా ఏమి చేయాలో పాలుపోవడం లేదు అని అంటున్నారు.
చమురు అస్త్రంతో :
ఒక వైపు చూస్తే అమెరికా ఇరాన్ ని ఎలాగైనా లొంగదీయాలని తమ రాజ్యం అక్కడ స్థాపించాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. అయితే ఇరాన్ మాత్రం ఏ విధమైన ఒత్తిళ్లకు తాము తల వంచమని స్పష్టం చేస్తోంది. తమ మీద జరుగుతున్న దాడులకు ఇంతకు ఇంతా బదులు ఇస్తామని కూడా సవాల్ చేస్తోంది. అసలు ఇరాన్ వెనక ఉన్నదేంటి, ఇంతటి డేరింగ్ ఎలా వచ్చింది అంటే ఒక్కటే జవాబు దొరుకుతుంది. అంతే చమురు అస్త్రం. ఈ రోజున ప్రపంచం అనే బండి నడవడానికి చమురు చాలా అవసరం. ఇంధనం లేకపోతే ఈ ప్రపంచం కదిలేది ఉండదు. అందుకే అమెరికా ఎంతలా టార్గెట్ చేస్తున్నా ఇరాన్ మాత్రం తమ వద్ద ఉన్న చమురు అస్త్రాన్ని ముందుకు పెడుతోంది. దానితోనే ప్రపంచన్ని అమెరికా మీదకు ఎగదోయవచ్చు అని చూస్తోంది.
అమెరికా మీద తీవ్ర ఒత్తిడి :
యుద్ధం అన్నది తొందరలో ముగియదని, ఎంతకాలం అయినా చేస్తామని అమెరికా అంటూంటే ఇరాన్ మాట ఎలా ఉన్నా ప్రపంచం మాత్రం బెదిరిపోతోంది. ఎందుకు అంటే చమురు సంక్షోభం తలెత్తుతుంది అని దాని వల్ల అన్ని దేశాలూ ఇబ్బందుల్లో పడతాయి అన్నదే ఇరాన్ మార్క్ వ్యూహం. ఇదే అసలు నిజం కూడా. కొన్ని రోజులు అయితే ఏ దేశమైనా తట్టుకుంటుంది కానీ దీర్ఘ కాలం యుద్ధం జరిగితే మాత్రం ఇంధన కొరతతో దేశాలకు దేశాలు అల్లల్లాడతాయి. దాంతో ఆయా దేశాలు అన్నీ ట్రంప్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
వాటినే టార్గెట్ చేసుకుని :
ఇది ఇరాన్ ధైర్యాన్ని పెంచుతూంటే మరో అంశం కూడా ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించేలా చేస్తోంది. అదే ఇరాన్ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు. వాటినే టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దెబ్బకు అమెరికా స్థావరాలు అన్నీ ఒక్కోటిగా కుప్ప కూలుతున్నాయి. అవన్నీ మళ్ళీ పునరుద్ధరించుకోవడం కానీ తిరిగి ఏర్పాటు చేసుకోవడం కానీ అమెరికాకు అతి పెద్ద ఆర్ధిక సవాల్. అందుకే అమెరికా మీద ఇరాన్ వ్యూహాత్మకంగానే యుద్ధం చేస్తోంది. ఈ దెబ్బకు పెద్దన్న వైపు నుంచి దిగి రావాల్సి ఉంటుంది కానీ తమ వైపు నుంచి అదిరేది బెదిరేది లేదని ఇరాన్ పట్టు బట్టి కూర్చుంది. సో ఇరాన్ ధీమాని చూసిన అమెరికా అయినా ఇజ్రాయెల్ అయినా ఏదో నాటికి వెనక్కి తగ్గుతాయా అన్నదే ఇపుడు అంతటా సాగుతున్న చర్చ. చూడాలి మరి ఏమి జరుగుతుందో.