సర్కార్ వారి సొమ్ము : భర్తలతో సహా మహిళా కార్పొరేటర్ల టూర్

Update: 2022-08-16 23:30 GMT
ప్రజలు ఎన్నుకున్న విశాఖ నగర పాలక సంస్థ  కార్పోరేటర్లు టూర్ పెట్టుకున్నారు. దాని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే దేశంలోని ఇతర కార్పోరేషన్లలో పారిశుద్ధ్యం ఎలా అమలవుతుంది అన్న దాని మీదనే అధ్యయనం చేయడం అక్కడ అమలవుతున్న ప్రాజెక్టుల తీరుతెన్నులను గమనించడం అన్న మాట. దేశంలో ఢిల్లీ, సిమ్లా, మనాలీ, చండీఘడ్ కార్పొరేషన్లలో  ఈ పర్యటన సాగుతుంది.

విశాఖ కార్పొరేషన్ లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉంటే ఇందులో 84 మంది కార్పొరేటర్లు ఈ టూర్ కి విమానంలో బయలుదేరి వెళ్ళారు. ఇక ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉంటే వారి భర్తలు కూడా ఈ టూర్ కి తయారవడమే ఇక్కడ విశేషం. మరి భార్యలు కార్పొరేటర్లా.

లేక భర్తలు కూడానా అంటే. మహిళా కార్పొరేటర్లను ఎన్నుకున్న చోట డబుల్ ఆఫర్ ఎపుడో జనాలకు ఇచ్చేశారు. భర్తల రాజ్యం వార్డులలో  ఎటూ ఉంది.

ఇపుడు అసలైన అధికారాలు తమ చేతుల్లో ఉంచుకున్న భర్తలు తామూ టూర్ చూడాలంటూ పట్టుబట్టి మరీ విమానం ఎక్కేశారు. ఈ టూర్ కి ఒక్కో కార్పోరేటర్ మీద జీవీఎంసీ ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేస్తోంది. టోటల్ గా కోటీ ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదంతా సర్కార్ వారి సొమ్మే.

మరి ఇందులో నుంచి నలభై మంది భర్తల ఖర్చు పూర్తిగా  అనధికారమే. అంటే దాదాపు అర కోటి మొత్తం అన్న మాట. మరి ఇది ఏ పద్దులో రాస్తారు అంటూ విశాఖలో విపక్షాలు మండిపడుతున్నాయి.

ఏదైనా పోయి రావలె టూరునకు అంటూ భర్తలు పెట్టే బేడా సర్దేసారు. అంటే ఇది అఫీషియల్ టూరా లేక ఫ్యామిలీ టూరా అన్నదే ఎవరికీ అర్ధం కావడం లేదు మరి.
Tags:    

Similar News